సోమవారం, 10 నవంబరు 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Last Updated : సోమవారం, 10 నవంబరు 2025 (12:08 IST)

Balakrishna 111: గాడ్‌ ఆఫ్‌ మాసెస్‌ ఈజ్‌ బ్యాక్‌ అంటూ గోపీచంద్ తాజా అప్ డేట్

God of Masses 111th movie
God of Masses 111th movie
నందమూరి బాలకృష్ణ నటించనున్న 111వ సినిమా దర్శకుడు గోపీచంద్ మలినేని కలయికలో రూపొందుతోంది. ఇందులో నయనతార నాయికగా నటిస్తోంది. ఇందులో బాలక్రిష్ణ ద్విపాత్రాభినయం చేస్తున్నాడు. అందులో ఓల్డ్ గెటప్  కథకు కీలకం. ఇంటర్ వెల్ కు ముందు వచ్చే ఎపిసోడ్ హైలైట్ గా వుంటుందని తెలుస్తోంది. ఇందులో రాజస్థాన్ లో కీలక సన్నివేశాల చిత్రీకరించనున్నారు. ఇప్పటికే అక్కడిలొకేషన్లను చూసిన గోపీచంద్ టీమ్ బాలక్రిష్ణ పై కొన్ని యాక్షన్ సీన్స్ కుటుంబ సన్నివేశాల చిత్రీకరిస్తున్నట్లు తాజా సమాచారం.
 
సతీష్ కిలారు నిర్మిస్తున్న పీరియాడిక్ కథతో రూపొందుతోంది. బాలకృష్ణ మహరాజుగా కనిపిస్తారు. ఎప్పుడు శివుడిని నమ్ముకునే బాలక్రిష్ణ ఈసారి అమ్మవారిని కూడా నమ్ముకున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమా గురించి గోపీచంద్‌ మలినేని ఎక్స్‌ వేదికగా పోస్ట్ పెట్టారు.. ‘గాడ్‌ ఆఫ్‌ మాసెస్‌ ఈజ్‌ బ్యాక్‌.. ఈసారి మా గర్జన మరింత గట్టిగా ఉండనుంది. బాలకృష్ణతో కలిసి మరోసారి వర్క్‌ చేస్తున్నందుకు ఎంతో సంతోషంగా ఉంది. ఇది చరిత్రలో నిలిచిపోయే చిత్రం కానుంది  అని పేర్కొన్నారు.