శుక్రవారం, 10 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By డీవీ
Last Updated : గురువారం, 19 డిశెంబరు 2024 (11:27 IST)

ఓజీలో ఐటెం సాంగ్ కు సిద్ధమవుతున్న నేహాశెట్టి !

Neha Shetty
Neha Shetty
డీజీ టిల్లు తో వెలుగులోకి వచ్చిన నేహాశెట్టి  ఆతర్వాత సీక్వెల్ టిల్లు స్క్వేర్ లో చేసింది. మరలా అదే హీరో విశ్వక్ సేన్ తో గ్యాంగ్ ఆఫ్ గోదావరి సినిమాలోనూ నటించింది. ఇప్పుడు అమ్మడుకు మంచి ఛాన్స్ వచ్చిందని వార్తలు వస్తున్నాయి. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న ఓజీలో చేయనున్నట్లు తెలుస్తోంది. ఇందులో ఐటెంసాంగ్ చేయబోతున్నట్లు సమాచారం. ప్రస్తుతం ఈ స్పెషల్ సాంగ్ ను షూట్ చేస్తున్నారట.
 
బ్యాంకాక్ లో సాంగ్ షూట్ చేస్తున్నారని తెలుస్తోంది. సుజిత్ దర్శకత్వంలో డివివి దానయ్య నిర్మిస్తున్నారు. ఇప్పటికే సగానికిపైగా షూట్ పూర్తయిన ఈ చిత్రం ప్రస్తుతం ప్యాచ్ వర్క్ కూడా కొనసాగుతుంది. ప్రియాంక మోహన్ నాయికగా నటిస్తుండగా, శ్రియారెడ్డి, ఇమ్రాన్ షహ్మి కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఇప్పటికే పవన్ కళ్యాణ్ మూడు సినిమాలు పూర్తి చేయాల్సివుంది.