శుక్రవారం, 10 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By సెల్వి
Last Updated : బుధవారం, 11 అక్టోబరు 2023 (15:26 IST)

అజిత్ సరసన తెలుగు హీరోయిన్.. ఎవరో తెలుసా?

Regina Cassandra
అతిపెద్ద తమిళ స్టార్ హీరోలలో ఒకరైన అజిత్ కుమార్ సరసన టాలీవుడ్ హీరోయిన్ నటించనుంది. అజిత్ ఇటీవలి చిత్రం "తెగింపు" అతని కెరీర్‌లో మరో భారీ హిట్‌గా నిలిచింది. ప్రస్తుతం విడా ముయర్చిలో అజిత్ నటిస్తున్నాడు. 
 
ఇక ఈ సినిమాపై భారీ అంచనాలున్నాయి. ఇప్పటికే సీనియర్ స్టార్ అయిన త్రిష ఇందులో హీరోయిన్. అజిత్ కుమార్- త్రిష కృష్ణన్ నటించిన ఈ రాబోయే డ్రామా విడా ముయార్చిలో టాలీవుడ్ యంగ్ హీరోయిన్ రెజీనా కసాండ్రా కూడా కనిపించనుంది. అయితే ఆమె మరో కథానాయికగా నటిస్తుందా లేక ఏదైనా ముఖ్యమైన పాత్రలో నటిస్తుందా అనేది ఇంకా క్లారిటీ రాలేదు.