బుధవారం, 12 మార్చి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By దేవి
Last Updated : శనివారం, 8 మార్చి 2025 (16:21 IST)

Rukshar Dhillon: హాపీ ఉమన్స్ డే గా నటి రుక్సార్ ధిల్లాన్ ఘాటు విమర్శలు

Rukshar Dhillon
Rukshar Dhillon
నిన్న హైదరాబాద్ లో జరిగిన దిల్ రుబా సినిమా ప్రమోషన్ లో ఫోటోగ్రాఫర్ల ప్రవర్తన పై  స్టేజి పై ఘాటుగా స్పందించింది. ఆమె స్పందనకు సోషల్ మీడియాలో రెస్పాన్స్ వచ్చింది. హైదరాబాద్ లో ఉన్న ఆమె దగ్గరికి  కొందరు ఫోటోగ్రాఫర్ల ఆమెతో సారి చెప్పించడానికి ప్రయత్నించినట్లు తెలిసింది. కాని ఆమె స్పందన ఏమిటనేది ఎక్స్ లో ఇలా పోస్ట్ చేసింది.
 
సాహశం అంటే ఉండటం నా ఎంపిక, భయంతో చతికిల పడటం నా ఎంపిక కాదు. ప్రేమించడం నా ఎంపిక, ఎప్పుడు ఎవరిని ప్రేమించాలో నా ఎంపిక కాదు. నా కోసం నేను మాట్లాడటం నా ఎంపిక, నిజం చెప్పటానికి భయపడటం నా ఎంపిక కాదు, ఫోజ్ ఇవ్వడం నా ఎంపిక, బలవంతంగా ఫోజ్ ఇవ్వడం నా ఎంపిక కాదు, ఇష్టం వచ్చినట్లు దుస్తులు ధరించడం నా ఎంపిక, నా దుస్తులు పై తీర్పు చెప్పటం నా ఎంపిక కాదు, ఆత్మ విశ్వాశం తో ఉండడం నా ఎంపిక, నేను ఎత్తుగ్గా ఎదుగుతానని భయపడడం నా ఎంపిక కాదు, అందరిని సమానంగా గౌరవించడం నా ఎంపిక, స్తీ గా నన్ను అవమానంగా చూడడం నా ఎంపిక కాదు, స్వేచ్చ పక్షిలా ఉండటం నా ఎంపిక, నన్ను ఖైదు చేయమని చెప్పడం నా ఎంపిక కాదు.నేను ఒక స్తీ ఇది నా ఎంపిక, నీది కాదు. హాపీ ఉమన్స్ డే. అంటూ సోషల్ మీడియాలో చెప్పింది.