మంగళవారం, 7 అక్టోబరు 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Last Updated : శనివారం, 4 అక్టోబరు 2025 (18:21 IST)

Vennela Kishore: వెన్నెల కిషోర్ పాడిన అనుకుందొకటిలే.. లిరికల్ సాంగ్

Vennela Kishore and team Santana Praptirastu
Vennela Kishore and team Santana Praptirastu
యూత్ ఫుల్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ సంతాన ప్రాప్తిరస్తు మూవీతో స్టార్ కమెడియన్ వెన్నెల కిషోర్ సింగర్ గా మారారు. ఈ చిత్రంలో ఆయన 'అనుకుందొకటిలే..' పాటను పాడటం విశేషం. "సంతాన ప్రాప్తిరస్తు" చిత్రంలో గర్భగుడి వెల్ నెస్ సెంటర్ నిర్వహించే డాక్టర్ భ్రమరం పాత్రలో వెన్నెల కిషోర్ నవ్వులు పంచనున్నారు. తన దగ్గరకు చికిత్స కోసం వచ్చిన కథానాయకుడికి ధైర్యం చెబుతున్న సందర్భంలో డాక్టర్ భ్రమరం పాత్ర నేపథ్యంగా 'అనుకుందొకటిలే..' పాటను ఆకట్టుకునేలా రూపొందించారు.
 
'అనుకుందొకటిలే..' పాట ఎలా ఉందో చూస్తే - అనుకుందొకటిలే, అయ్యిందొకటిలే,అయిపోలేదులే, గేరే మార్చులే,  భ్రమరం ఫార్ములా ఫెయిలే అవదులే, కళ్లే మూసుకో, నన్నే నమ్ముకో.. అంటూ వినోదాత్మకంగా సాగుతుందీ పాట. ఈ పాటను సునీల్ కశ్యప్ కంపోజ్ చేయగా, బాలవర్థన్ లిరిక్స్ అందించారు. వెన్నెల కిషోర్ ప్రొఫెషనల్ సింగర్ లా పాడి ఆకట్టుకున్నారు.
 
విక్రాంత్, చాందినీ చౌదరి హీరో హీరోయిన్లుగా నటిస్తున్న "సంతాన ప్రాప్తిరస్తు" సినిమాను మధుర ఎంటర్ టైన్ మెంట్, నిర్వి ఆర్ట్స్ బ్యానర్స్ పై మధుర శ్రీధర్ రెడ్డి, నిర్వి హరిప్రసాద్ రెడ్డి నిర్మిస్తున్నారు. దర్శకుడు సంజీవ్ రెడ్డి ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. రచయిత షేక్ దావూద్ జి ఈ సినిమాకు స్క్రీన్ ప్లే అందించారు. "సంతాన ప్రాప్తిరస్తు" సినిమా త్వరలోనే గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు రెడీ అవుతోంది. 
 
నటీనటులు - విక్రాంత్, చాందినీ చౌదరి, వెన్నెల కిషోర్,  తరుణ్ భాస్కర్, అభినవ్ గోమటం, మురళీధర్ గౌడ్, హర్షవర్థన్, బిందు చంద్రమౌళి, జీవన్ కుమార్, సత్య కృష్ణ, తాగుబోతు రమేష్, అభయ్ బేతిగంటి, కిరీటి, అనీల్ గీల, సద్దాం తదితరులు