Manoj: నన్నే కాదు నా కుటుంబాన్ని నిలబెట్టి ఆయనే : మంచు మనోజ్
Manchu Manoj, Lakmi Prasanna
మంచు మనోజ్ చాలా కాలం తర్వాత సంతోషంగా వున్నారు. ఆయన తన జీవితంలోని ఎత్తుపల్లాలను చవిచూశాక ఇటీవల తన కుటుంబంలో జరిగిన సంఘటనలతో జీవితాన్ని ఎలా డీల్ చేయాలనే మందన పడ్డాడట. ఒక దశలో సినిమాలు లేక తన పిల్లలను ఎలా పెంచుతానో అనే బాధను కూడా వ్యక్తం చేశారు. చాలా కాలం వరకు ఆయన ఫోన్ కు కాల్స్ కూడా వచ్చేవికావు. అలాంటిది ఒక్క మిరాయ్ సినిమా మొత్తాన్ని మార్చేసింది. మిరాయ్ సక్సెస్ గా రన్ అవుతున్న సందర్భంగా సక్సెస్ మీట్ లో ఆయన ఆనందాన్ని వ్యక్తం చేశారు.
ఎన్నో సంవత్సరాల నుంచి నాకు ఫోన్స్ వస్తుంటే కలలా వుంది. నిజంగా దర్శకుడు కార్తీక్ ఘట్టమనేని నన్ను మిరాయ్ సినిమాలో తీసుకోవడం ఆయనకు జన్మాంతం రుణ పడి వుంటాను. ఈ కథ చెప్పాగానే ఎక్కడికో తీసుకెలుతుంది అనిపించింది. అలాగే సోషల్ మీడియాలో కానీ నేను బయటకు వెళ్ళినా ..అన్నా నువ్వు సినిమా తీయ్.. మళ్ళీ కమ్ బ్యాక్ ఎప్పుడూ. ఒక్క సినిమా చేయి మేం చూసుకుంటామని అంటుండేవారు. వస్తున్నా త్వరగా వస్తున్నా.. అంటూ వారికి ధైర్యంగా చెప్పేవాడిని. కానీ లోపల భయపడేవాడిని. ఈమధ్య అనుకున్నది ఒకటి జరిగేది ఒకటి అందుకే జీవితం మంటే భయమేసేది. నేను సినిమా చేయాలని అనుకుంటుండగా నా దగ్గరికి దర్శకుడు కార్తీక్ రావడం, తేజ్ నన్ను తీసుకోమనడం చకచకా జరిగిపోయాయి. నేను కార్తీక్ వంటి దర్శకుడిని చూడలేదు. కార్తీక్ గారు.. మీరు నన్ను నిలబెట్టలేదు. నా కుటుంబాన్ని నిలబెట్టారు అని పేర్కొన్నారు.
ఒకప్పుడు నాకు తెలీని భయం వుండేది. ఇన్ని గొడవల మధ్య నేను నా పిల్లల్ని సరిగ్గా చూసుకోగలనా? అని భయపడేవాడిని. కానీ మిరాయ్ చిత్రం తో ఒక్కసారిగా ఆ భయాన్ని కార్తీక్ పోగొట్టారు. అసలు ఈ సినిమా తీయడానికి కారణమైన విశ్వప్రసాద్ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అన్నారు.