శుక్రవారం, 10 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఠాగూర్
Last Updated : మంగళవారం, 12 నవంబరు 2024 (17:11 IST)

జబర్దస్త్ షో.. అన్నం పెట్టిం ఆదరించింది.. మరిచిపోకూడదు : వెంకీ మంకీ..

venky monkey
ప్రముఖ టీవీలో ప్రసారమయ్యే జబర్దస్త్ షో ద్వారా అనేక హాస్యనటులు ఎంతో పాపులర్ అయ్యారు. వారంతా ఆర్థికంగా నిలదొక్కుకోవడంతో పాటు తెలుగులు ప్రేక్షకుల్లో తమకంటూ ఓ గుర్తింపూ క్రేజ్‌‍ను సొంతం చేసుకున్నారు. ఇలాంటి వారిలో వెంకీ మంకీ ఒకరు. తాజాగా ఆయన ఇచ్చిన ఇంటర్వ్యూలో అనేక విషయాలను వెల్లడించారు. జబర్దస్త్ అన్నం పెట్టి ఆదరించిందని, ఈ విషయాన్ని ఏ ఒక్కరూ మరిచిపోరాదని సూచించారు. 
 
ఇంకా ఆయన మాట్లాడుతూ, 'నేను మిమిక్రీ ఆర్టిస్టును.. అక్కడక్కడా షోస్ ఇస్తూ ఉండేవాడిని. చమ్మక్ చంద్ర చూసి నన్ను 'జబర్దస్త్'కి పరిచయం చేశాడు. కమెడియన్‌గా నాకు అక్కడ మంచి గుర్తింపు వచ్చింది' అని గుర్తు చేశారు.
 
'దర్శకుడు కావాలన్న ఉద్దేశంతో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టాను. స్క్రిప్టు రాయడంలో నాకు అనుభవం కూడా ఉంది. నటన కూడా కొద్దిగా తెలుసు. అందువల్ల 'జబర్దస్త్'లో నిలదొక్కుకోగలిగాను. 10 ఏళ్లపాటు టీమ్ లీడర్‌గా కొనసాగాను. 'జబర్దస్త్' నాకు జీవితాన్ని ఇచ్చింది. 'జబర్దస్త్' గురించి ఎవరేం మాట్లాదారనేది నాకు తెలియదుగానీ, ఆ షో అన్నం పెట్టి ఆదరించిందనే విషయాన్ని మరిచిపోకూడదు అనేది నా ఉద్దేశం' అని చెప్పాడు.
 
'చలాకీ చంటి అనారోగ్యం బారిన పడితే, అతని గురించి కొన్ని యూ ట్యూబ్ ఛానల్స్ ఇష్టం వచ్చినట్టుగా రాశాయి. ఆ మధ్య నాకు చిన్న ప్రమాదం జరిగితే కూడా అలాగే చేశారు. అందువలన మా ఇంట్లో వాళ్లు చాలా కంగారుపడ్డారు. ఇలాంటి ప్రచారాల వలన, మాకు అవకాశం ఇవ్వాలనుకున్నవాళ్లు ఆలోచిస్తారు. మేం యాక్ట్ చేసే స్థితిలో లేమనుకుని వేరే వాళ్లకు ఆ ఛాన్స్ ఇస్తారు. దయచేసి ఇలాంటి ప్రచారాలు చేయకండి' అని ఆయన విజ్ఞప్తి చేశారు.