సోమవారం, 29 సెప్టెంబరు 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : గురువారం, 25 సెప్టెంబరు 2025 (11:42 IST)

Buddhist monks: కేబుల్‌తో నడిచే రైలు బోల్తా పడింది.. ఏడుగులు బౌద్ధ సన్యాసులు మృతి

Buddhist monks
Buddhist monks
వాయువ్య శ్రీలంకలోని ఒక అటవీ మఠం వద్ద కేబుల్‌తో నడిచే రైలు బండి బోల్తా పడటంతో ఏడుగురు బౌద్ధ సన్యాసులు మరణించగా, మరో ఆరుగురు గాయపడ్డారని పోలీసులు గురువారం తెలిపారు.
 
కొలంబో నుండి 125 కి.మీ దూరంలో ఉన్న నికావెరటియాలో ఉన్న ప్రఖ్యాత బౌద్ధ మఠం నా ఉయన అరణ్య సేనసనయలో బుధవారం రాత్రి ఈ సంఘటన జరిగింది. ఈ మఠం ధ్యాన విహారాలకు ప్రసిద్ధి చెందింది.
 
ప్రపంచవ్యాప్తంగా అభ్యాసకులను ఆకర్షిస్తుంది. మరణించిన ఏడుగురు సన్యాసులలో ఒక భారతీయుడు, ఒక రష్యన్,  ఒక రొమేనియన్ జాతీయుడు ఉన్నారని పోలీసులు తెలిపారు. గాయపడిన ఆరుగురిలో నలుగురి పరిస్థితి విషమంగా ఉందని వారు తెలిపారు.