శుక్రవారం, 10 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated : గురువారం, 4 జులై 2024 (12:31 IST)

జపాన్ ప్రభాస్ ఫ్యాన్స్ ప్రత్యేకంగా హైదరాబాద్ వచ్చారు

Prabhas
Prabhas
పాన్ ఇండియా స్టార్ డమ్ దాటేసి గ్లోబల్ ఫ్యాన్ బేస్ సంపాదించుకున్నారు రెబెల్ స్టార్ ప్రభాస్. ఆయన నటించే ప్రతి సినిమా ఎల్లులు దాటి ప్రేక్షకులను ఎంటర్ టైన్ చేస్తోంది. తన చిత్రాలతో సరిహద్దులు లేని అభిమానం సంపాదించుకుంటున్నారు ప్రభాస్. బాహుబలి నుంచి ఈ ఫినామినా మొదలైంది. సలార్ బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ తర్వాత ఇప్పుడు కల్కి 2898ఎడితో ప్రభాస్ మరోసారి లోకల్ టు గ్లోబల్ తన స్టార్ డమ్ సత్తా ప్రూవ్ చేస్తున్నారు.
 
కల్కి 2898 ఎడి సినిమా చూసేందుకు రీసెంట్ గా జపాన్ నుంచి ప్రభాస్ ఫ్యాన్స్ ప్రత్యేకంగా హైదరాబాద్ వచ్చారు. ప్రసాద్స్ ఐమ్యాక్స్ లో ఈ బ్లాక్ బస్టర్ మూవీని చూశారు. మల్టీప్లెక్స్ ముందు ఉన్న బుజ్జి కారును, ప్రభాస్ కటౌట్ తో సెల్ఫీస్, ఫొటోస్ తీసుకున్నారు. ఈ ఫొటోస్ ను నిర్మాణ సంస్థ వైజయంతీ మూవీస్ తన ఇన్ స్టా అక్కౌంట్ ద్వారా షేర్ చేసింది. కల్కి 2898ఎడి సినిమా విజయం పట్ల జపాన్ ఫ్యాన్స్ శుభాకాంక్షలు తెలిపారు.
 
ప్రభాస్ కొత్త సినిమా వచ్చిందంటే అది ఇండియన్ బాక్సాఫీస్ రికార్డులకు మరో చరిత్రను లిఖిస్తోంది. బహుబలి, సలార్ తర్వాత కల్కి 2898ఎడి సినిమాతో తన థర్డ్ బిగ్గెస్ట్ ఓపెనింగ్స్ మూవీ దక్కించుకున్నారు ప్రభాస్. రెబెల్ స్టార్ చేస్తున్న భారీ లైనప్, ఆ సినిమాల్లో శ్రమతో, అంకితభావంతో, నటనా ప్రతిభతో తను పోట్రే చేస్తున్న క్యారెక్టర్స్, బ్యాక్ టు బ్యాక్ ఈ హ్యూజ్ మూవీస్ చేసేందుకు ఆయన పడుతున్న కష్టం...ఇవన్నీ ప్రభాస్ ను మరో స్టార్ అందుకోలేనంత ఎత్తులో నిలబెడుతున్నాయి. ఆయన అభిమానులు గర్వించేలా చేస్తున్నాయి.
 
వైజయంతీ మూవీస్ నిర్మాణంలో దర్శకుడు నాగ్ అశ్విన్ ఫ్యూచరిస్టిక్ సైఫై మైథాలజీ విజన్ తో కల్కి 2898ఎడి సిల్వర్ స్క్రీన్ మీద ఒక కొత్త ప్రపంచాన్ని ఆవిష్కరించింది. ఈ కొత్త ప్రపంచం విఖ్యాత నటీనటులు, వివిధ రంగాల దిగ్గజాలతో పాటు సీ సెంటర్ లో కింద సీట్ లో కూర్చున్న ఓ సాధారణ ప్రేక్షకుడిని సైతం మైమరచి చూసేలా చేస్తోంది.