CM: కర్నాటక ముఖ్యమంత్రిని, సూపర్ స్టార్ సుదీప్ ను కలిసిన మంచు మనోజ్
Manchu Manoj, Karnataka Chief Minister Siddaramaiah, Bhuma Mounika
రాకింగ్ స్టార్ మంచు మనోజ్ కర్నాటక ముఖ్యమంత్రి సిద్దరామయ్యను మర్యాదపూర్వకంగా కలుసుకుని శాలువతాతో సత్కరించారు. సతీమణి భూమా మౌనికతో ముఖ్యమంత్రి ఇంటికి వెళ్ళి కలిసి వెళ్ళిన మనోజ్ ను ఆప్యాయంగా పలుకరించారు సిద్దరామయ్య. మంచుమనోజ్ ముఖ్యమంత్రిని సత్కరించి, ఆయనతో కొంత సమయం గడిపారు.
Manchu Manoj, Superstar Kiccha Sudeep
అనంతరం కన్నడ సూపర్ స్టార్ కిచ్చా సుదీప్ ను కూడా కలిశారు. ఈ సందర్భంగా వారిరువురూ సినిమా విశేషాలను పంచుకున్నారు. మోహన్ బాబుగారితో తనకున్న అనుబంధాన్ని సుదీప్ గుర్తు చేసుకున్నారు.
కాగా, నిన్ననే మనోజ్ తన సతీమణి భూమా మౌనికతో కలిసి శివరాజ్ కుమార్ కుటుంబ సభ్యులను మీట్ అయ్యారు. క్యాన్సర్ కు చికిత్స తీసుకుని కోలుకుంటున్న శివరాజ్ కుమార్ ఆరోగ్య పరిస్థితిని మనోజ్ అడిగి తెలుసుకున్నారు. ఆయన త్వరగా కోలుకోవాలని మనోజ్ ఆకాంక్షించారు. ఇటీవల మిరాయ్ సినిమాతో బ్లాక్ బస్టర్ సక్సెస్ అందుకున్నారు మనోజ్. ఈ నేపథ్యంలో మనోజ్ కు శుభాకాంక్షలు తెలిపారు శివరాజ్ కుమార్.