శుక్రవారం, 10 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఠాగూర్
Last Updated : బుధవారం, 21 ఆగస్టు 2024 (08:36 IST)

మెగాస్టార్ చిరంజీవి బర్త్‌డే స్పెషల్ - మెగా మారథాన్

chiranjeevi
మెగాస్టార్ పద్మవిభూషణ్ చిరంజీవి పుట్టినరోజు ఈ నెల 22వ తేదీన జరుగనుంది. ఈ సందర్భంగా "విశ్వంభరుడు" పేరుతో గ్లోబల్ లైవ్ మారథాన్‌ను నిర్వహించనున్నారు. ఇది ప్రపంచవ్యాప్తంగా కోట్లాదిమంది అభిమానుల ప్రేమ అభిమానాన్ని ఏకం చేసెలా నిర్వహిస్తున్న వేడుక కావడం గమనార్హం. ఇందులో వందకుపైగా దేశాల నుండి‌ మెగా అభిమానులు అందరూ కలిసి మెగాస్టార్ పట్ల తమ గౌరవాన్ని మరియు అభిమానాన్ని వ్యక్తం చేయనున్నారు.
 
న్యూయార్క్ నుండి టోక్యో వరకు, సిడ్నీ నుండి జోహన్నెస్‌బర్గ్ వరకు, అభిమానులు మెగాస్టార్ కోసం ఏకమవుతున్నారు. మెగాస్టార్‌పై వారికున్న ప్రేమను 12 గంటల ప్రత్యక్ష మారథాన్ ద్వారా తెలుపనున్నారు. ఆగస్టు 21 మధ్యాహ్నం నుంచి ఆగస్టు 22, ఉదయం 12 గంటల (అర్థరాత్రి) వరకు ఈ లైవ్ కొనసాగనుంది. మెగాభిమానులతో పాటు, విశ్వంభర టీమ్ కూడా ఇందులో జాయిన్ కాబోతున్నారు.