శుక్రవారం, 10 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 21 అక్టోబరు 2024 (16:51 IST)

చై - శోభిత పెళ్లి పనులు ప్రారంభం... పసుపు దంచుతున్న ఫోటోలు వైరల్

shobita dhulipalla
టాలీవుడ్ హీరో అక్కినేని నాగ చైతన్య, నటి శోభిత ధూళిపాళ్ల పెళ్లి పనులు ప్రారంభమైనట్టుగా తెలుస్తున్నాయి. వీరికి ఇటీవల నిశ్చితార్థం జరిగిన విషయం తెల్సిందే. తాజాగా పెళ్లి పనులు ప్రారంభంకాగా, ఇందులో ఇరు కుటుంబాలకు చెందిన కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. వీరంతా పసుపు దంచుతున్న ఫోటోలను శోభిత తన ఇన్‌స్టా ఖాతాలో షేర్ చేశారు. 
 
గోధుమరాయి పసుపు దంచడంతో పనులు ప్రారంభమయ్యాయి అని క్యాప్షన్ పెట్టారు. ఎరుపు రంగ, గోధుమ వర్ణం పట్టు చీరలో శోభిత మెరిసిపోతూ కనిపించారు. ప్రస్తుతం ఆ ఫోటోలు వైరల్‌గా మారాయి. పెళ్ళి ఎక్కడ, ఎపుడో చెప్పాలని అభిమానులు కోరుతున్నారు. కాగా, ఇటీవల తన కాబోయే భార్యతో నాగ చైతన్య దిగిన ఫోటోలను షేర్ చేసిన విషయం తెల్సిందే. వీరిద్దరూ ట్రెండీ లుక్స్‌లో ఉన్న ఆ ఫోటో కూడా క్షణాల్లో వైరల్ అయింది. 
 
కాగా, చై - శోభితలు ఎంతోకాలంగా మంచి స్నేహితులుగా ఉన్నారు. వీరిద్దరూ ఇరు కుటుంబాల అంగీకారంతో ఆగస్టు నెల 8వ తేదీన నిశ్చితార్థం చేసుకున్నారు. హైదరాబాద్ నగరంలోని హీరో నాగార్జున నివాసంలో జరిగిన ఈ వేడుకలో కుటుంబ పెద్దలు, అత్యంత సన్నిహితులు మాత్రమే పాల్గొన్నారు.