శుక్రవారం, 10 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated : గురువారం, 20 జూన్ 2024 (18:11 IST)

పరువు రెండో సీజన్ కోసం ఎదురుచూస్తున్నా: మెగాస్టార్ చిరంజీవి

Megastar Chiranjeevi
Megastar Chiranjeevi
గోల్డ్ బాక్స్ ఎంటర్టైన్మెంట్స్ ప్రై.లి. బ్యానర్ మీద విష్ణు ప్రసాద్ లగ్గిశెట్టి, సుస్మిత కొణిదెల నిర్మించిన ZEE5 ఒరిజినల్ సిరీస్ ‘పరువు’. సిద్దార్థ్ నాయుడు, వడ్లపాటి రాజశేఖర్ ఈ చిత్రానికి దర్శకులు. ఈ మూవీలో నాగబాబు, నివేదా పేతురాజ్, నరేష్ అగస్త్య, ప్రణీత పట్నాయక్, బిందు మాధవి, అమిత్ తివారి వంటి వారు ప్రముఖ పాత్రలు పోషించారు. పవన్ సాధినేని షో రన్నర్‌గా రాబోతోన్న ఈ ZEE5 ఒరిజినల్ సిరీస్ జూన్ 14 నుంచి స్ట్రీమింగ్ అవుతోంది.
 
ఈ వెబ్ సిరీస్ ఎంతో గ్రిప్పింగ్‌గా ఉండటం.. ఉత్కంఠ భరితంగా సాగడంతో వీక్షకులను ఇట్టే ఆకట్టుకుంది. ఇక రెండో సీజన్ కూడా అందరూ ఎదురుచూస్తున్నారు. పరువు వెబ్ సిరీస్‌ను చూసిన మెగాస్టార్ చిరంజీవి సోషల్ మీడియా వేదికగా ట్వీట్ వేశారు. రెండో సీజన్ కోసం ఎదురుచూస్తున్నానని అన్నారు.
 
ఒక చక్కటి ప్లాన్‌తో చందు బాడీ మాయం చేసి, ఆ జంట పడే తిప్పలు, అదే విషయమై ఎమ్మెల్యే గారి పాట్లు. చివరకి ఈ జంట తప్పించుకుందా లేదా అని సీజన్‌2 లోనే చూడాలనుకుంటా అని తన ఎగ్జైట్మెంట్‌ను పంచుకున్నారు. ‘పరువు చాలా పెద్ద సక్సెస్ అయింది.. తెలుగు ఓటీటీలో అద్భుతమైన కంటెంట్‌ను ఇస్తున్న సుష్మిత కొణిదెలను చూస్తుంటే ఎంతో గర్వంగా ఉంది. నా ప్రియమైన సోదరుడు నాగబాబు అద్బుతంగా నటించారు’ అని చిరంజీవి వేసిన ట్వీట్ అందరినీ ఆకట్టుకుంటోంది.