శుక్రవారం, 7 ఫిబ్రవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 3 ఫిబ్రవరి 2025 (15:27 IST)

నిర్మాతల కోరికలు తీరిస్తేనే సినిమా ఛాన్సులు వస్తాయా? : నిర్మాత రాందాస్ ఏమంటున్నారు?

romance
దర్శక నిర్మాతల కోరికలు తీరిస్తేనే సినిమా ఛాన్సులు వస్తాయంటూ పలువురు హీరోయిన్లు చేస్తున్న ప్రచారాన్ని టాలీవుడ్ నిర్మాత ముత్యాల రాందాస్ తిప్పికొట్టారు. ఇదంతా శుద్ధ అసత్య ప్రచారమని పేర్కొన్నారు. అలాంటి ఆరోపణలు చేసే హీరోయిన్లు తమను కోరికలు తీర్చమన్న వారిపై ఫిర్యాదులు చేయకుండా మీడియా ముందు వ్యాఖ్యానించడమేంటని ఆయన ప్రశ్నించారు. 
 
ఇటీవల 'దంగల్' హీరోయిన్ ఫాతిమా సన్ షేక్ ఓ నిర్మాతపై సంచలన ఆరోపణలు చేశారు. వీటిపై ముత్యాల రాందాస్ స్పందిస్తూ, తెలుగు చిత్రపరిశ్రమలో క్యాస్టింగ్ కౌచ్ అనేది తప్పుడు ప్రచారమన్నారు. టాలీవుడ్‌లో మహిళా నటీమణులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకున్నామని తెలిపారు. ఇందుకోసం ప్రత్యేక కమిటీలు కూడా వేశామని ఆయన గుర్తుచేశారు. 
 
ఇండస్ట్రీలో ఏ నటి అయినా, ఎవరి కారణంగానైనా ఇబ్బంది కలిగినా, వేధింపులకు గురైనా కమిటీ దృష్టికి తీసుకెళ్లాలని ఆయన సూచించారు. ఫాతిమా సనా షేక్ విషయానికి వస్తే సినిమాలో అవకాశం కోసం ఓ నిర్మాత తనను కమిట్మెంట్ అడిగారంటూ కామెంట్స్ చేశారని, అలా అడిగినపుడే చెప్పుతో కొట్టుండాల్సిందని, ఆ తర్వాతైనా వేధింపుల కమిటీకి ఫిర్యాదు చేయాల్సిందని ఆయన అభిప్రాయపడ్డారు. 
 
మరో నిర్మాత నట్టి కుమార్ మాట్లాడుతూ, తెలుగు చిత్రపరిశ్రమలో అభాండాలు వేయడం ఏమాత్రం సబబు కాదన్నారు. కమిట్మెంట్ అడిగిన నిర్మాత పేరును బయటపెట్టాలని ఫాతిమాను నట్టి కుమార్ డిమాండ్ చేశారు. నిర్మాతపై ఫిర్యాదు చేయకుండా మీడియా ముందుకు రావడం సబబు కాదని ఆయన అభిప్రాయపడ్డారు.