1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By దేవీ
Last Updated : సోమవారం, 12 మే 2025 (11:35 IST)

Tarak: కళ్యాణ్ రామ్, ఎన్.టి.ఆర్. (తారక్) పేర్లు ప్రస్తావించిన పురందేశ్వరి

NTR Family At NTR ghat
NTR Family At NTR ghat
లెజెండరీ ఎన్టీఆర్ ముని మనవడు నందమూరి తారక రామారావు కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం నేడు నెక్లెస్ రోడ్ లోని ఎన్.టి.ఆర్. ఘాట్ వద్ద ప్రారంభమైంది. నంద‌మూరి హ‌రికృష్ణ మ‌న‌వ‌డు, జూనియర్ ఎన్టీఆర్ అన్నయ్య జాన‌కిరామ్ కుమారుడు తార‌క రామారావు హీరోగా పరిచయం అవుతున్నాడు. ఇందులో తెలుగు కూచిపూడి నృత్యకారిణి వీణారావ్ నాయికగా నటిస్తోంది. దర్శకుడు వైవిఎస్. చౌదరి నిర్మిస్తూ దర్శకత్వం వహిస్తున్నారు. నేడు హీరో హీరోయిన్లపై నారా భువనేశ్వరి క్లాప్ తో ప్రారంభించారు.
 
ఈ సందర్భంగా నారా భువనేశ్వరి మాట్లాడుతూ, నందమూరి తారకరామ్.. ముత్తాత నందమూరి తారకరామారావులా కీర్తి, ప్రతిష్ట లబ్దిపొందాలని కోరుకుంటున్నాను. నాతోపాటు నా కుటుంబసభ్యులంతా అదే కోరుకుంటున్నారు.నాకు చాలా సంతోషంగా వుంది. ఫోర్త్ జనరేష్ మూవీ లో వస్తున్నారు. రామ్ కసితో వస్తున్నాడు. తనలోని టాలెంట్ ను నిరూపించుకునేందకు రాబోతున్నాడు. అలా వున్న వ్యక్తి పైకి ఎదుగుతాడు. అలాగే న్యూ టాలెంట్ రోర్ ప్రొడక్షన్ గీత గారికి క్రుతజ్థతలు తెలియజేస్తున్నాను. దర్శకుడు వైవిఎస్. చౌదరి శుభాకాంక్ష లు తెలియజేస్తున్నాను. నందమూరి కుటుంబానికి వైవిఎస్. ఎప్పుడూ ముందుంటారు.
 
పురందేశ్వరి మాట్లాడుతూ, నందమూరి వంశంలో మరో తరం సినిమా రంగంలో కాలు పెట్టింది. అంకితభావంతో పనిచేసేవారికి తెలుగు సినిమారంగంలో ఉన్నతరంగంలో వెలుగుతారు. ఏ రంగంలోనైనా అది కీలకం. మా తరానికి ముందు తరం నందమూరి తారకరామారావు గారు జీవితాన్ని చలనచిత్రరంగానికి అంకితం చేశారు. తెలుగు చలనచిత్రరంగం వున్నంతవరకు పేరు వుంటుంది. ఆ తర్వాత బాలక్రిష్ణ, హరిక్రిష్న కూడా చిత్రరంగంపై ముద్ర వేశారు. ఆ తర్వాత కళ్యాణ్ రామ్, తారకరామారావు కూడా అంకితభావంతో చేశారు. ఇప్పుడూ ఆ తర్వాత తరం నందమూరి తారకరామారావు (రామ్) ఇప్పుడు చలనచిత్ర అరంగేట్రం చేయడం జరిగింది. మా నాన్నగారి, హరిక్రిష్ణ ఆశీస్సులుంటాయి. వైవిఎస్. చౌదరిగారు హనుమంతుడు లాంటివారు అన్నారు.