1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఠాగూర్
Last Updated : గురువారం, 15 మే 2025 (16:47 IST)

ఆ కోలీవుడ్ దర్శకుడుతో సమంతకు రిలేషన్? : దర్శకుడు భార్య ఏమన్నారంటే...

samanta
హీరోయిన్ సమంత, దర్శకుడు రాజ్ నిడిమోరుల మధ్య రహస్య సంబంధం ఉందంటూ జోరుగా ప్రచారం సాగుతోంది. పైగా, సమంత, రాజ్ నిడుమూరి కలుస్తుండటంతో ఈ పుకార్లకు మరింతగా బలం చేకూరింది. ఈ నేపథ్యంలో రాజ్ నిడిమోరు భార్య శ్యామాలి తాజాగా ఇన్‌స్టాగ్రామ్లో చేసిన ఓ సందేశాత్మక పోస్ట్ ఇపుడు తీవ్ర చర్చనీయాంశంగా మారింది. 
 
"నా గురించి ఆరోచించేవారు, వినేవారు, మాట్లాడేవారు, నన్ను కలిసేవారు, నాతో మాట్లాడేవారు.. నా గురించి రాసేవారందరికీ నా ప్రేమ, ఆశీస్సులు పంపుతున్నా..." అంటూ శ్యామాలి తన ఇన్‌స్టాగ్రామ్‌లో సందేశాత్మక పోస్ట్ పెట్టడం వెను ఆంతర్యతమేమిటన్న దానిపై నెటిజన్లు తమకు తోచిన విధంగా చర్చించుకుంటున్నారు.