గురువారం, 21 ఆగస్టు 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By దేవీ
Last Updated : బుధవారం, 20 ఆగస్టు 2025 (15:56 IST)

పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో రాజేంద్ర ప్రసాద్ నటించిన నేనెవరు?

Rajendra Prasad, Abhilash, Jogini Shyamala
Rajendra Prasad, Abhilash, Jogini Shyamala
సెలెక్టివ్ గా సినిమాలు చేస్తున్న నటకిరీటి డా: రాజేంద్ర ప్రసాద్, నువ్వేకావాలి, ప్రేమించు" వంటి సూపర్ హిట్ ఫిల్మ్స్ ఫేమ్ సాయికిరణ్, జోగిని శ్యామల ముఖ్యపాత్రల్లో నటించిన సినిమా నేనెవరు?. చిరంజీవి తన్నీరు దర్శకత్వంలో తెరకెక్కుతున్న సందేశభరిత వినోదాత్మక చిత్రంగా రూపొందుతోంది. జై చిరంజీవ మూవీ మేకర్స్ పతాకంపై సరికొండ మల్లిఖార్జున్ సమర్పణలో అండేకర్ జగదీష్ బాబు - సకినాన భూలక్ష్మి సంయుక్తంగా నిర్మించారు.

ఈ చిత్రంతో వైజాగ్ సత్యానంద్ శిష్యులు అభిలాష్, సాయిచెర్రి హీరోలుగా పరిచయమవుతున్నారు. దీపిక - సోనాక్షి జబర్దస్త్ రాజమౌళి ఇతర పాత్రల్లో నటించిన ఈ చిత్రం షూటింగ్ ముగించుకుని, ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటోంది.
 
త్వరలో విడుదల తేది ప్రకటించుకోనున్న ఈ చిత్రం టైటిల్ లోగోను తెలుగు నిర్మాతల మండలి అధ్యక్షులు ప్రముఖ నిర్మాత కె.ఎల్.దామోదర్ ప్రసాద్,  ప్రముఖ దర్శకులు రేలంగి నరసింహారావు, వి.సముద్ర ఆవిష్కరించి చిత్ర యూనిట్ కి అభినందనలు తెలిపారు. హైదరాబాద్ లోని, తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ప్రివ్యూ ధియేటర్ లో జరిగిన ఈ వేడుకలో చిత్రబృందం పాల్గొని, ఈ సినిమా తామందరికీ పేరు తెచ్చిపెడుతుందని పేర్కొన్నారు.
 
ఈ చిత్రానికి పి.ఆర్.ఒ: ధీరజ్ - అప్పాజీ, మాటలు: శ్రీనివాస్, పాటలు: ఎస్.ఎస్.వీరు, మ్యూజిక్: చిన్నికృష్ణ, ఎడిటర్: నందమూరి హరి - తారకరామారావు, సినిమాటోగ్రఫీ: నాయుడు ప్రసాద్ కొల్లి, సమర్పణ: సరికొండ మల్లిఖార్జున్, నిర్మాతలు: అండేకర్ జగదీష్ బాబు - సకినాన భూలక్ష్మి, రచన - దర్శకత్వం: చిరంజీవి తన్నీరు.