శుక్రవారం, 10 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : శుక్రవారం, 20 డిశెంబరు 2024 (15:47 IST)

Ram Gopal Varma : తెలంగాణ పోలీసులు స్వర్గానికి వెళ్లి శ్రీదేవిని అరెస్టు చేస్తారా?

SriDevi
అల్లు అర్జున్ అరెస్టు చుట్టూ వివాదం చెలరేగుతున్న నేపథ్యంలో, ప్రముఖ చిత్రనిర్మాత రామ్ గోపాల్ వర్మ శ్రీదేవికి మద్దతుగా నిలిచి శ్రీదేవిపై ఒక ప్రశ్నను లేవనెత్తారు. క్షణ క్షణం షూటింగ్ సమయంలో దివంగత తార శ్రీదేవి చూడటానికి వచ్చిన ముగ్గురు వ్యక్తులు మరణించారని పేర్కొన్నారు.
 
ఇంకా ఎక్స్‌లో వర్మ ఇలా రాశారు. "ప్రతి స్టార్ అల్లు అర్జున్ అరెస్టుకు వ్యతిరేకంగా తీవ్రంగా నిరసన తెలియజేయాలి. ఎందుకంటే ఏ సెలబ్రిటీ అయినా, అది ఫిల్మ్ స్టార్ అయినా, పొలిటికల్ స్టార్ అయినా, వారు చాలా ప్రజాదరణ పొందడం నేరమా?" అంటూ ప్రశ్నించారు. 
 
ఇంకా తెలంగాణ పోలీసులను ఉద్దేశించి వర్మ సెటైరికల్ కామెంట్లు చేశారు. "నా సినిమా క్షణ క్షణం షూటింగ్‌లో శ్రీదేవిని చూడటానికి వచ్చిన లక్షలాది మందిలో ముగ్గురు చనిపోయారు.. కాబట్టి ఇప్పుడు అంటే తెలంగాణ పోలీసులు స్వర్గానికి వెళ్లి శ్రీదేవిని అరెస్టు చేస్తారా???" అంటూ ప్రశ్నించారు. 
 
క్షణ క్షణం 1991 నాటి చిత్రం. ఈ చిత్రంలో వెంకటేష్, పరేష్ రావల్, రామి రెడ్డి నటించారు. కాగా డిసెంబర్ 4న అల్లు అర్జున్ హాజరైన పుష్ప-2 ప్రీమియర్ షో సందర్భంగా సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాటలో ఒక మహిళ మరణించగా, ఆమె కుమారుడు తీవ్రంగా గాయపడ్డాడు.