శుక్రవారం, 10 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : మంగళవారం, 17 డిశెంబరు 2024 (19:50 IST)

సంధ్య థియేటర్‌ లైసెన్స్‌ను ఎందుకు రద్దు చేయకూడదు : సీవీ ఆనంద్

sandhya theater
హైదరాబాద్ నగరంలోని ఆర్టీసీ క్రాస్ రోడ్డులో ఉన్న సంధ్య థియేటర్ లైసెన్స్‌ను ఎందుకు రద్దు చేయరాదో వివరణ ఇవ్వాలని హైదరాబాద్ నగర పోలీసులు షోకాజా నోటీసులు జారీచేశారు. ఈ థియేటర్ నిర్వహణలో 11 లోపాలను పోలీసులు గుర్తించి ఈ నోటీసులు జారీచేశారు. ఈ విషయాన్ని హైదరాబాద్ నగర పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ వెల్లడించారు. 
 
ఈ నె 4వ తేదీన పుష్ప-2 ప్రీమియర్ షో సందర్భంగా థియేటర్ యాజమాన్యం నిర్లక్ష్యం వల్ల జరిగిన ఘటనపై లైసెన్స్ ఎందుకు రద్దు చేయకూడదే తెలపాలంటూ నోటీసులు జారీ చేశారు. దీనిపై పది రోజుల్లో వివరణ ఇవ్వాలని నోటీసులో పేర్కొన్నారు. 
 
థియేటర్‌కు ఇరువైపులా రెస్టారెంట్‍‌లు ఉన్నాయని, నటులొస్తే భద్రత కల్పించలేమని చిక్కడపల్లి పోలీసులు ముందుగానే హెచ్చరించినట్టు ఓ రిపోర్డు సమాజిక మధ్యమాల్లో ఇప్పటికే వైరల్ అయింది. సంధ్య 70 ఎంఎం, 35 ఎంఎం రెండు థియేటర్లు ఒకే చోట ఉండగా వీటిలో దాదాపు 2520 సీటింగ్ కెపాసిటీ ఉంది. మహిళలు థియేటర్‌‍లోకి వెళ్లేందుకు ప్రత్యేక ఎంట్రీ, డిస్‌ప్లే బోర్డులు ఎక్కడా ఏర్పాటు చేయలేదు. ప్రేక్షకులు థియేటర్‌లోకి వెళ్లేందుకు ఒకటే మార్గం ఉంది. 
 
ఎక్కువ మంది ప్రేక్షకులు థియేటర్‌కు వచ్చే విధంగా ప్రోత్సహిస్తోన్న యాజమాన్యం రద్దీని నియంత్రించేందుకు మాత్రం ఎలాంటి చర్యలు తీసుకోలేదని పోలీసులు దర్యాప్తు తేలింది. అల్లు అర్జున్ మధ్య థియేటర్‌కు వచ్చిన సమయంలో జరిగిన తొక్కిసలాటలో ఓ మహిళ మృతి చెందడం, బాలుడు తీవ్రంగా గాయపడిన ఘటనను పోలీసులు తీవ్రంగా పరిగణించారు. ఈ కేసులో ఇప్పటికే అల్లు అర్జున్‌ను అరెస్టు చేసిన పోలీసులు.. తాజాగా సంధ్య థియేటర్ లైసెన్స్‌ను ఎందుకు ద్దు చేయకూడదో వివరణ ఇవ్వాలని షోకాజ్ నోటీసు జారీ చేయడం గమనార్హం.