శుక్రవారం, 10 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఠాగూర్
Last Updated : శుక్రవారం, 16 ఆగస్టు 2024 (08:39 IST)

తండ్రితో కొంతసమయం గడపాలని ఉంది : ఆద్య - పవన్ సెల్ఫీ ఫోటోపై రేణూ దేశాయ్ కామెంట్స్

Renu Desai
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తన కుమార్తె ఆద్యతో కలిసి స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను గురువారం కాకినాడలో జరుపుకున్నారు. ఈ సందర్భంగా తన కుమార్తెతో పవన్ కళ్యాణ్ ఓ సెల్ఫీ దిగారు. ఈ ఫోటో ఇపుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఈ సెల్ఫీ ఫోటోపై పవన్ మాజీ భార్య, ఆద్య తల్లి రేణూ దేశాయ్ స్పందించారు.
pawan - adya
 
'స్వాతంత్ర్యం దినోత్సవ కార్యక్రమానికి నాన్నతో కలిసి వెళ్లొచ్చా అని ఆద్య అడిగింది. ఆద్య నన్ను అలా అడగడం ఎంతో ఆనందాన్ని కలిగించింది. ఎందుకంటే, ఆమె తన తండ్రితో కొంత సమయం గడపాలని కోరుకుంటుంది. తద్వారా ప్రభుత్వంలో కీలక పదవిలో ఉన్న వ్యక్తి జీవితం ఎంత బిజీగా ఉంటుందో, తన తండ్రి ఏపీ ప్రజల కోసం ఎంత పాటుపడుతున్నారో చూసి అర్థం చేసుకుని, అభినందించే అవకాశం ఆద్యకు లభిస్తుంది" అని రేణూ దేశాయ్ అన్నారు.