శుక్రవారం, 10 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated : శుక్రవారం, 13 డిశెంబరు 2024 (07:33 IST)

సంబరాల ఏటిగట్టు ఊచకోత తో సాయితేజ్ కి బ్లాక్ బస్టర్ హిట్ అవుతుంది: రామ్ చరణ్

Ramchanra, siate and team
Ramchanra, siate and team
సాయి దుర్గ తేజ్ 18వ సినిమా టైటిల్ ను రామ్ చరణ్ లాంచ్ చేసి హిట్ కావాలని ఆకాంక్షించారు. రోహిత్ కెపి, కె నిరంజన్ రెడ్డి, చైతన్య రెడ్డి, ప్రైమ్ షో ఎంటర్‌టైన్‌మెంట్స్ పాన్ ఇండియా మూవీ టైటిల్  కార్నేజ్‌ ను గురువారం రాత్రి హైదరాబాద్ లో నిర్వహించారు. ఈ సినిమాను  సెప్టెంబర్ 25, 2025న థియేట్రికల్ రిలీజ్ గా ప్రకటించారు.
 
కార్నేజ్‌ వీడియో సాయి దుర్గ తేజ్ విధ్వంసక, ఇంటెన్స్ క్యారెక్టర్ కు స్నీక్ పీక్ అందిస్తోంది. గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ముఖ్యఅతిధిగా పాల్గొన్న కార్నేజ్ లాంచ్ ఈవెంట్ చాలా గ్రాండ్ గా జరిగింది. టైటిల్ ని కార్నేజ్ వీడియో ద్వారా రివిల్ చేశారు. ఇది శక్తివంతమైన, విభిన్నమైన వాయిస్‌ఓవర్స్ తో ఓపెన్ అయ్యింది. పవర్ ఫుల్ వాయిస్ సాయి దుర్గ తేజ్ మ్యాసీవ్ ఇంట్రడక్షన్ కి స్టేజ్ ని సెట్ చేసింది. ఒక అద్భుతమైన సీక్వెన్స్‌లో అతను రక్తం కారుతున్న తన వీపులో ఉన్న కత్తిని తీసి శత్రువులని ఊచకోత కోశారు. టీజర్ SDT పవర్ ఫుల్ డైలాగ్‌తో ముగుస్తుంది, అతని ఫెరోషియస్, లార్జర్ దెన్ లైఫ్ క్యారెక్టర్ పై మరింత ఎక్సయిట్మెంట్ ని పెంచింది. ఈ పాత్ర కోసం SDT ఫిజికల్ ట్రాన్స్ ఫర్మేషన్ అద్భుతంగా వుంది. ఇది ఒక వారియర్ లాంటి ఫిజిక్ ని సాధించడానికి అతని అంకితభావం, కృషిని సూచిస్తోంది. రాయలసీమ యాసలో డైలాగ్స్ క్యారెక్టర్ కి మరింత కంప్లీట్ నెస్ ని తీసుకొచ్చాయి.    
 
డెబ్యూ డైరెక్టర్ రోహిత్ కెపి గ్రిప్పింగ్ విజన్‌ తో SDT పాత్రను లార్జర్ దెన్ లైఫ్ మేనర్ లో ప్రజెంట్ చేశారు. డైలాగ్‌లు పవర్ ఫుల్ గా వున్నాయి. ప్రతి ఫ్రేమ్ ప్రొడక్షన్ గ్రేట్ స్కేల్ ని ప్రజెంట్ చేస్తున్నాయి. సినిమాటోగ్రాఫర్ వెట్రివేల్ పళనిసామి బ్రెత్ టేకింగ్ విజువల్స్ నెక్స్ట్ లెవల్ లో వున్నాయి. సంగీత దర్శకుడు బి అజనీష్ లోక్‌నాథ్ పల్సటింగ్ స్కోర్ కథనాన్ని సరికొత్త స్థాయికి తీసుకువెళుతుంది. నవీన్ కట్స్ ఎడిటింగ్ క్రిస్ప్ గా ఉంది. కార్నేజ్ వీడియో SYG (సంబరాల ఏటిగట్టు) గ్రేట్ సినిమాటిక్ ఎక్స్ పీరియన్స్ అందిస్తూ సినిమా పైభారీ అంచనాలని పెంచింది. ఈ చిత్రం పాన్-ఇండియా సెప్టెంబర్ 25, 2025న తెలుగు, తమిళం, హిందీ, కన్నడ, మలయాళంలో విడుదల కానుంది.
 
రామ్ చరణ్ మాట్లాడుతూ, మేము ఎంతగానో గుండెల్లో పెట్టుకొని ప్రేమించే మా అభిమానులందరికీ పేరుపేరునా నమస్కారం. ముందుగా తేజ్ కి కంగ్రాచ్యులేషన్స్.  ఒక ఫైటర్ లా ఈ టెన్ ఇయర్స్ ని పూర్తి చేశాడు. ఇది బ్యూటిఫుల్ జర్నీ. తేజ్ ఒక మంచి యాక్టర్ మాత్రమే కాదు మంచి వ్యక్తి. అది మీ అందరికీ తెలుసు. తను ఒక మంచి తమ్ముడు, మంచి అన్నయ్య, మంచి కొడుకు, మంచి మేనల్లుడు. తను ప్రతి క్యారెక్టర్ కి తపన పడతాడు. కష్టపడతాడు. మీ అందరి సపోర్ట్ వల్లే తను ఇక్కడ ఉన్నాడు. తేజు ఈరోజు ఇక్కడ ఎలా నిలిచి ఉండటానికి కారణం అభిమానుల బ్లెస్సింగ్స్. ఇది తనకి పునర్జన్మ. ఈ జన్మ అభిమానులే ఇచ్చారు. ఆ సమయాన్ని మళ్లీ గుర్తు చేసుకోవాలని నాకు లేదు. కానీ ఆ మూడు నెలలు మాకు చాలా కష్టమైన సమయం. అంత పెద్ద యాక్సిడెంట్ తర్వాత తేజు మళ్లీ ఇక్కడ నిల్చున్నాడు అంటే తిను మా తేజ్ కాదు మీ తేజు. మీ అందరికీ తేజ్ తరఫున, మా విజయ అక్క తరపున పేరుపేరునా ధన్యవాదాలు. ఇది తేజుకి 18 ఫిల్మ్. సంబరాల ఏటిగట్టు. అందరికీ ఒకటే మాట చెబుతున్నా. 
 
తేజు ఊచకోత ఎలా ఉంటుందో ఈ సినిమాతో చూడబోతున్నారు. ఔట్ స్టాండింగ్ విజువల్స్. రోహిత్ గారికి ప్రత్యేకంగా థాంక్స్ చెప్తున్నాను. తను ఫస్ట్ సినిమా చేస్తున్నట్టుగా లేదు. చాలా అద్భుతంగా ఉంది. తేజ్ మీద ఇంత పెద్ద బడ్జెట్ పెడుతున్నందుకు నిర్మాతలు నిరంజన్, చైతన్య గారికి ఆల్ ది వెరీ బెస్ట్. ఇది సినిమా పట్ల వారికి ఉన్న ఫ్యాషన్ ని తెలియజేస్తుంది. ఐశ్వర్య గారికి, ఈ సినిమాలో పని చేస్తున్న టెక్నీషియన్స్ కి ఆల్ ది వెరీ బెస్ట్. ఇది ఇది బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. తేజు ప్రేమ చాలా బండ ప్రేమ. ఒక్కసారి పట్టుకుంటే ఊపిరి కూడా ఆడదు. అంత గట్టిగా ప్రేమిస్తాడు. ఈ సినిమాతో చాలా పెద్ద బ్లాక్ బస్టర్ కొట్టి మంచి న్యూస్ కూడా వినిపించాలని కోరుకుంటున్నాను. థాంక్యూ. లవ్ యూ ఆల్' అన్నారు.