ఆయన మారడు...సో... నేను లేనపుడు నాతో వచ్చిన వారు.. నాతోనే పోతారు.... మహిళ సెల్ఫీ వీడియో
హైదరాబాద్ నగరంలోని బాలా నగర్ ఠాణా పరిధిలో ఇద్దరు పిల్లలను హత్య చేసి తాను కూడా ప్రాణాలు తీసుకుంది. ఆయన మారడు... ఇది తప్పు అయినా పొరపాటు చేస్తున్నా.. నన్ను క్షమించండి.. నాతో వచ్చిన నా పిల్లలు నాతోనే పోవాలి అంటూ సెల్ఫీ వీడియోను రికార్డు చేసి పెట్టి, తాము ఉండే అపార్టుమెంటులో నాలుగో అంతస్తు నుంచి దూకి ప్రాణాలు తీసుకుంది. దీనిపై స్థానిక పోలీసులు చేపట్టిన ప్రాథమిక దర్యాప్తులో ఆసక్తికర విషయాలు వెలుగులోకి వచ్చాయి. భర్త వేధింపుల వల్లే ఆ మహిళ ఆత్మహత్య చేసుకున్నట్టు ప్రాథమికంగా తేలింది.
తాజాగా బాలా నగర్‌లో ఓ మహిళ తన ఇద్దరు పిల్లలను హత్య చేసి తాను కూడా ఆత్మహత్య చేసుకున్న విషయం తెల్సిందే. దీనిపై స్థానిక పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. ఏపీలోని గుంటూరు జిల్లాకు చెందిన మారయ్యబాబు దంపతులు హైదరాబాద్ నగరంలో గత 25 యేళ్ళుగా ఉంటున్నారు. వీరి కుమార్తె సాయిలక్ష్మి (27)ని హైదరాబాద్ నగరానికి చెందిన సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ అనిల్ కుమార్ (30)కు ఇచ్చి మూడేళ్ళ క్రితం పెళ్ళి చేశారు. వీర్దదరూ పద్మరావు నగర్‌లోని ఓ అపార్టుమెంట్‌లో ఉంటున్నారు.
ఈ దంపతులకు కార్తికేయ (2), లాస్యత వల్లి (2) అనే ఇద్దరు కవల పిల్లలు ఉన్నారు. అయితే, కుమార్తెకు సరిగా వస్తుండగా, కుమారుడుకు మాత్రం సరిగా మాటలు రావు. జన్యుపరమైన సమస్య ఉండటమే దీనికి కారణమని వైద్యులు వెల్లడించారు. అప్పటి నుంచి భార్యను భర్త వేధించసాగాడు. కుమారుడుకి మాటలు బాగా రావాలని ఆస్పత్రుల చుట్టూత తిరిగినా భర్త వేధింపులు మాత్రం ఆగలేదు. సాయిలక్ష్మి తన సమస్యను తల్లిదండ్రులకు చెప్పగా, వాలు పలుమార్లు అల్లుడుకి నచ్చజెప్పడానికి ప్రయత్నించినా ఫలితం లేకుండా పోయింది.
ఈ క్రమంలో మంగళవారం భర్త అనిల్ కుమార్ వెళ్లేందుకు మియాపూర్‌లోని తన సోదరుడు ఇంటికి వెళ్లాడు. సోమవారం రాత్రి భర్త వీడియోకాల్ చేయగా, సాయిలక్ష్మి మాట్లాడింది. ఆ తర్వాత పిల్లలను చంపేసి తాను కూడా ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయం తీసుకుంది. ముందుగా తన తల్లిదండ్రులను ఉద్దేశించి ఓ వీడియో సందేశాన్ని రికార్డుచేసింది. "ఆయన మారడు. అందుకే కష్టమైనా పొరపాటు చేస్తున్నా. క్షమించండి. నేను లేనపుడు పిల్లలు ఉండటం అనవసరం. నాతో వచ్చిన వారు నాతోనే పోతారు అంటూ వీడియో రికార్డు చేసింది.
మంగళవారం కార్తికేయ, లాస్యతవల్లిలు నిద్రిస్తుండగా దిండుతో ఊపిరాడకుండా చేసి హతమార్చింది. ఆ తర్వాత తాను ఉండే అపార్టుమెంటు నాలుగో అంతస్తుకు వెళ్లి.. అక్కడ నుంచి కిందకు దూకి ప్రాణాలు తీసుకుంది. సాయిలక్ష్మి తండ్రి ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు మృతురాలి భర్త, అత్తమామలపై కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు.