శుక్రవారం, 24 అక్టోబరు 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Last Updated : శుక్రవారం, 24 అక్టోబరు 2025 (11:16 IST)

Sri Vishnu: ఒంగోలు నేపథ్యంలో శ్రీ విష్ణు, నయన్ సారిక జంటగా చిత్రం

Sri Vishnu, Nayan Sarika
Sri Vishnu, Nayan Sarika
కథానాయకుడు శ్రీ విష్ణు నటిస్తున్న తాజా సినిమా ప్రకటన వెలువడింది. ఒంగోలు పట్టణం నేపథ్యంగా యదునాథ్ మారుతీ రావు దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర సినిమాస్ బ్యానర్‌పై సుమంత్ నాయుడు జి నిర్మిస్తుండగా హేమ & షాలిని ఈ చిత్రాన్ని సమర్పిస్తారు, సుబ్రహ్మణ్యం నాయుడు జి, రామాచారి ఎం సహ నిర్మాతలు.
 
ఈ చిత్రం సక్సెస్ ఫుల్ హీరో శ్రీ విష్ణు సరసన నయన్ సారిక హీరోయిన్ గా నటించనున్నారని మేకర్స్ అనౌన్స్ చేశారు. ఒంగోలులో షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా గురించి మరిన్ని వివరాలు త్వరలో తెలియజేయనున్నారు. ఈ చిత్రంలో సత్య, బ్రహ్మాజీ, ప్రవీణ్, శ్రీకాంత్ అయ్యంగార్, గోపరాజు రమణ, ప్రమోదిని కీలక పాత్రల్లో నటించారు. స్టార్ టెక్నిషియన్స్ ఈ సినిమాని పని చేస్తున్నారు. సాయి శ్రీరామ్ డీవోపీ కాగా రధన్ సంగీతం సమకూరుస్తారు. ఎ రామాంజనేయులు ఆర్ట్ డైరెక్టర్‌గా వ్యవహరిస్తారు.