శుక్రవారం, 10 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated : సోమవారం, 11 నవంబరు 2024 (12:57 IST)

భీమవరం నేపథ్యంలో సుమంత్ ప్రభాస్ కథానాయకుడిగా చిత్రం

srivishnu clap by on Sumanth Prabhas, Nidhi Pradeep
srivishnu clap by on Sumanth Prabhas, Nidhi Pradeep
'మేం ఫేమస్‌' చిత్రంతో లీడ్ యాక్టర్, దర్శకుడిగానూ మంచి గుర్తింపు తెచ్చుకున్న సుమంత్ ప్రభాస్ హీరోగా తన రెండో మూవీని అనౌన్స్ చేశారు. ఈ కొత్త మూవీ రెడ్ పప్పెట్ ప్రొడక్షన్స్ మేడిన్ వెంచర్. MR ప్రొడక్షన్స్ షార్ట్ ఫిల్మ్‌లతో పాపులరైనా సుభాష్ చంద్ర దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. చెన్నైకు చెందిన నిధి ప్రదీప్ హీరోయిన్ గా నటిస్తోంది. ముహూర్తం షాట్‌కు హీరో శ్రీవిష్ణు క్లాప్‌ కొట్టారు, సురేష్‌బాబు కెమెరా స్విచాన్‌ చేశారు. దర్శకులు శ్రీకాంత్ ఓదెల, శౌర్యువ్, మహేష్ బాబు పి తొలి షాట్‌కి దర్శకత్వం వహించారు. 
 
హీరో సుమంత్ ప్రభాస్ మాట్లాడుతూ.. ఫస్ట్ సినిమా 'మేం ఫేమస్' నీ అందరూ చాలా గొప్పగా ఆదరించారు. నెక్స్ట్ ఎలాంటి ప్రాజెక్ట్ చేయాలని ఏడాదిన్నరగా అలోచించాను.  దాదాపు 86కి పైగా కథలు విన్నాను. కథలు ఎక్కడో మనసుకు నచ్చలేదు. అలాంటి సమయంలో ఈ సినిమా రైటర్, డైరెక్టర్ సుభాష్ చంద్ర వచ్చి ఈ కథ చెప్పారు. ప్యూర్ ఆంధ్ర, భీమవరం వైబ్ లో అద్భుతంగా వుంది. అభినవ్ అన్న చాలా పాషనెట్  ప్రొడ్యూసర్. చాలా మంచి కథ తీసుకోచ్చారు. ఈ సినిమాని అందరూ ఆదరించాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను. అందరికీ థాంక్ యూ సో మచ్' అన్నారు.
 
జగపతి బాబు మేజర్ రోల్ పోషిస్తున్న ఈ చిత్రంలో రాజీవ్ కనకాల, హర్షవర్ధన్, సుదర్శన్, రాజ్‌కుమార్ కసిరెడ్డి, వైవా రాఘవ్, రీను & రోహిత్ కృష్ణ  ఇతర ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు.
 
ఈ మూవీ యూత్‌ఫుల్ మ్యూజికల్ రొమాంటిక్ కామెడీ, ఇది బిగ్ స్క్రీన్స్ కు సరికొత్త ఎక్స్ పీరియన్స్ తీసుకువస్తుంది. పశ్చిమగోదావరి ప్రాంతంలోని విజువల్ బ్యూటీని ప్రజెంట్ చేసే ఈ చిత్రాన్ని భీమవరం పరిసర ప్రాంతాల్లో చిత్రీకరించనున్నారు.