శుక్రవారం, 10 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated : శనివారం, 28 సెప్టెంబరు 2024 (19:39 IST)

మా నాన్న సూపర్ హీరో నుంచి వేడుకలో సాంగ్ రిలీజ్

Sai Chand, sudheer babu
Sai Chand, sudheer babu
నవ దళపతి సుధీర్ బాబు అప్ కమింగ్ హోల్సమ్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ 'మా నాన్న సూపర్ హీరో'లోఎమోషనల్ ప్యాక్డ్ రోల్ లో కనిపించనున్నారు. అభిలాష్ రెడ్డి కంకర దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని CAM ఎంటర్‌టైన్‌మెంట్‌తో కలిసి V సెల్యులాయిడ్స్ బ్యానర్‌పై సునీల్ బలుసు నిర్మిస్తున్నారు. రీసెంట్ గా రిలీజైన ఈ మూవీ టీజర్ స్ట్రాంగ్ ఇంపాక్ట్ క్రియేట్ చేసింది.  
 
ఫస్ట్ సింగిల్ 'నాన్న సాంగ్' చార్ట్ బస్టర్ హిట్ తో మ్యూజికల్ ప్రమోషన్స్ కిక్ స్టార్ట్ చేసిన మేకర్స్ ఈ రోజు సెకెండ్ సింగిల్ వేడుకలో సాంగ్ ని రిలీజ్ చేశారు.    
 
జై క్రిష్ ఈ పాటని పర్ఫెక్ట్ వెడ్డింగ్ సెలబ్రేషన్ సాంగ్ గా కంపోజ్ చేశారు. సనాపతి భరద్వాజ పాత్రుడు రాసిన బ్యూటీఫుల్ అండ్ మీనింగ్ ఫుల్ లిరిక్స్ ఆకట్టుకున్నాయి. ఐశ్వర్య దరూరి, బృందా, చైతు సత్సంగి, అఖిల్ చంద్ర తమ వోకల్స్ తో మెస్మరైజ్ చేశారు.  
 
ఈ సాంగ్ లో సుధీర్ బాబు కూల్ ప్రజెన్స్ కట్టిపడేసింది. ఎలిగెన్స్ డ్యాన్స్ మూమెంట్స్ అదరగొట్టారు. సుధీర్ బాబు, సాయి చంద్ ఆన్ స్క్రీన్ కెమిస్ట్రీ హైలెట్ గా నిలిచింది. విజువల్స్ బ్యూటీఫుల్ గా వున్నాయి. వేడుకలో ఇన్స్టంట్ చార్ట్ బస్టర్ సెలబ్రేషన్స్ సాంగ్ గా నిలిచింది.  
 
ఆర్ణ హీరోయిన్ గా నటిస్తున్న ఈ మూవీలో సాయి చంద్, రాజు సుందరం, శశాంక్, ఆమని, అన్నీ కీలక పాత్రలు పోషిస్తున్నారు.  
 
ఈ సినిమాకి సమీర్ కళ్యాణి సినిమాటోగ్రాఫర్ కాగా, అనిల్ కుమార్ పి ఎడిటర్, ఝాన్సీ గోజాల ప్రొడక్షన్ డిజైనర్. మహేశ్వర్ రెడ్డి గోజాల  క్రియేటివ్ ప్రొడ్యూసర్. MVS భరద్వాజ్, శ్రవణ్ మాదాల, అభిలాష్ రెడ్డి కంకర ఈ చిత్రానికి కో రైటర్స్.  
మా నాన్న సూపర్ హీరో అక్టోబర్ 11న గ్రాండ్ గా విడుదల కానుంది.
 తారాగణం: సుధీర్ బాబు, ఆర్ణ, సాయి చంద్, సాయాజీ షిండే, రాజు సుందరం, శశాంక్, ఆమని, అన్నీ