1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By దేవీ
Last Updated : శుక్రవారం, 9 మే 2025 (18:14 IST)

రౌడీ వేర్ లాభాల్లో కొంత వాటా భారత సైన్యానికి విరాళం: విజయ్ దేవరకొండ

Vijaydevarakonda letter
Vijaydevarakonda letter
సొసైటీ కోసం, దేశం కోసం తన వంతు బాధ్యత వహించేందుకు ఎప్పుడూ ముందుంటారు హీరో విజయ్ దేవరకొండ. ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్న పొరుగు దేశం పాకిస్థాన్ కు సరైన గుణపాఠం నేర్పేందుకు మన భారత సైన్యం ముందడుగు వేస్తోంది. ఇలాంటి సమయంలో తన బాధ్యతగా ఇండియన్ ఆర్మీకి విరాళం ప్రకటించారు హీరో విజయ్ దేవరకొండ. 
 
రాబోయో కొన్ని వారాల పాటు తన క్లాత్ బ్రాండింగ్ రౌడీ వేర్ అమ్మకాల్లో వచ్చే లాభాల్లోని కొంత వాటాను భారత సైన్యానికి విరాళం ఇవ్వబోతున్నట్లు వెల్లడించారు. మేడ్ ఇన్ ఇండియా మాత్రమే కాదు మేడ్ ఫర్ ఇండియా అంటూ తన సోషల్ మీడియా అక్కౌంట్ ద్వారా  షేర్ చేశారు విజయ్ దేవరకొండ.
 
అల్లు అరవింద్ కూడా విరాళం
భారత్ మాతా కీ జై.. మా సపోర్ట్ ఎప్పుడు మన సైనికులకే.. సింగిల్ సినిమా వసూళ్ల నుంచి వచ్చిన లాభాల్లో  కొంత భాగాన్ని మన సైనికులకు  అందించనున్నాము అని అల్లు అరవింద్ ప్రకటించారు.