శుక్రవారం, 10 జనవరి 2025
  1. ఇతరాలు
  2. ప్రేమాయణం
  3. వాలెంటైన్స్ డే
Written By సిహెచ్
Last Modified: గురువారం, 9 ఫిబ్రవరి 2023 (10:47 IST)

చాక్లెట్ డే, డార్క్ చాక్లెట్ గిఫ్ట్‌గా ఇస్తే...

Dark Chocolate
వాలెంటైన్స్ వారంలోని మూడవ రోజు చాక్లెట్ డే. దీనిని ఫిబ్రవరి 9న జరుపుకుంటారు. రోజ్ డే, ప్రపోజ్ డేని అనుసరించి ప్రియమైన వారితో చాక్లెట్లు- స్వీట్ ట్రీట్‌లను మార్చుకోవడానికి అంకితమైన రోజు. లవర్స్ డే ఫిబ్రవరి 7 నుండి ఫిబ్రవరి 14 వరకు ఉంటుంది. ఈ సందర్భంగా డార్క్ చాక్లెట్లను చాలామంది ప్రిఫర్ చేస్తుంటారు.
 
డార్క్ చాక్లెట్ వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలేంటో చాలా మందికి తెలియదు. ప్రతిరోజూ కొద్ది మొత్తంలో డార్క్ చాక్లెట్ తినడం వల్ల గుండె జబ్బులు రాకుండా చూసుకోవచ్చు. ఇది అధిక రక్తపోటు, కొలెస్ట్రాల్‌ను నియంత్రిస్తుంది.
 
డిప్రెషన్ వంటి మూడ్ స్వింగ్‌లను తగ్గించుకోవడానికి డార్క్ చాక్లెట్ తినడం మంచిది. ప్రతిరోజూ 24 గ్రాముల డార్క్ చాక్లెట్ తినడం వల్ల ప్రయోజనాలు ఉంటాయి. డార్క్ చాక్లెట్ మధుమేహం, ఊబకాయంతో పోరాడుతుంది. ఇందులో ఉండే మోనోఅన్‌శాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్ శరీరంలో మెటబాలిజంను పెంచుతుంది. ఇది కేలరీలను బర్న్ చేయడంలో సహాయపడుతుంది.