శుక్రవారం, 10 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. వీడ్కోలు 2024
Written By సెల్వి
Last Updated : గురువారం, 19 డిశెంబరు 2024 (18:08 IST)

Pushpa 2 Collection: రూ: 1500 కోట్లకు చేరువలో పుష్ప-2

Pushpa 2
Pushpa 2
Pushpa 2 Collection: అల్లు అర్జున్, రష్మిక మందన్న పుష్ప 2 కలెక్షన్స్‌లలో తగ్గేదే లే అన్నట్లు దూసుకుపోతోంది. అల్లు అర్జున్, రష్మిక మందన్న, ఫహద్ ఫాజిల్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఇంకా జోరు చూపిస్తోంది. క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ తెరకెక్కించిన పుష్ప 2: ది రూల్ ఈ బుధవారమే (డిసెంబర్ 18) బాక్సాఫీస్ వద్ద రెండు వారాల రన్ పూర్తి చేసుకుంది. 
 
14వ రోజున ఇండియాలో పుష్ప 2 నెట్ కలెక్షన్స్ రూ. 973 కోట్లకు చేరుకున్నాయి. భారతదేశంలో పుష్ప 2 మూవీకి 14వ రోజున రూ. 20.8 కోట్ల నెట్ కలెక్షన్స్ వచ్చాయి. వాటిలో తెలుగు నుంచి రూ. 3.25 కోట్లు రాగా హిందీ బెల్ట్‌లో అత్యధికంగా రూ.16.25 కోట్లు వచ్చాయి.
 
అంటే, బాలీవుడ్ హారర్ కామెడీ బ్లాక్ బస్టర్ మూవీ స్త్రీ 2 ఓవరాల్ ఇండియా నెట్ కలెక్షన్స్‌ (రూ. 627.50)కు దగ్గరిలో పుష్ప 2 హిందీ కలెక్షన్స్ ఉన్నాయి. 14వ రోజు అయిన బుధవారం నాడు తెలుగు రాష్ట్రాల్లో పుష్ప 2 ది రూల్ మూవీకి 20.58 శాతం థియేటర్ ఆక్యుపెన్సీ నమోదు అయింది. 
 
పుష్ప 2 తెలుగు, హిందీ, తమిళం, మలయాళం, కన్నడతో సహా అన్ని భాషలలో విడుదలైన 15వ రోజు నాటికి భారతదేశంలో రూ. 974.42 కోట్లు వసూలు చేసి బలమైన ప్రదర్శనను కొనసాగిస్తోంది. 15వ రోజు ఈ చిత్రం రూ. 1.22 కోట్లు సాధించింది.
 
పుష్ప 2: ది రూల్ బాక్సాఫీస్ రికార్డులను బద్దలు కొడుతూ భారతదేశంలో రూ. 900 కోట్లు, ప్రపంచవ్యాప్తంగా రూ. 1400 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. తద్వారా ఈ చిత్రం స్త్రీ 2, జవాన్‌లను అధిగమించి, అన్ని కాలాలలో అత్యధిక వసూళ్లు చేసిన హిందీ చిత్రంగా నిలిచింది.