శుక్రవారం, 10 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 11 నవంబరు 2024 (13:45 IST)

ఆడపిల్లలపై అఘాయిత్యానికి పాల్పడితే అది కోసేస్తానంటున్న అఘోరి!! (Video)

lady aghori
రెండు తెలుగు రాష్ట్రాల్లోనేకాకుండా దేశ వ్యాప్తంగా ఆడపిల్లలు, మహిళలపై అఘాయిత్యాలు పెరిగిపోతున్నాయి. వీటి కట్టడికి ఎన్నో రకాలైన చర్యలను ప్రభుత్వాలు చేపడుతున్నప్పటికీ ఈ ఆగడాలు మాత్రం ఎక్కడా తగ్గుముఖం పట్టడం లేదు. ఈ నేపథ్యంలో ఏపీలో పర్యటిస్తున్న ఓ మహిళా అఘోరి సంచలన వ్యాఖ్యలు చేశారు. 
 
ఆడబిడ్డలు, మహిళలపై జరురుగుతున్న అత్యాచార ఘటనల నేపథ్యంలో ఆమె చేసిన వ్యాఖ్యలు ఇపుడు సంచలనంగా మారాయి. స్త్రీ శక్తి బయటకు వస్తే ఎవరూ తట్టుకోలేరని, మహిళల కోసం తన ప్రాణాన్ని సైతం వదిలేయడానికి సిద్ధంగా ఉన్నట్టు ఆమె ప్రకటించారు. కోటప్పకొండ త్రికోటేశ్వర ఆలయాన్ని ఆమె సోమవారం దర్శించుకున్నారు. శంషాబాద్ నగరంలో ధ్వంసమైన గుడి వద్ద మహాతాండవం ఆడబోతున్నట్టు ఆమె ప్రకటించారు. దీన్ని దమ్ముంటే ఆపాలంటూ అఘోరి సవాల్ విసిరారు. 
 
ఇదిలావుంటే, అమరావతి అమరేశ్వర స్వామి దేవస్థానంలో అఘోరి పూజలు చేశారు. అంతకు ముందు స్నానాల ఘాట్‌లోకి కారుతో సహా వెళ్లే ప్రయత్నం చేయగా.. కారుకు రాళ్లను పోలీసులు అడ్డుపెట్టి ఆమె వాహనాన్ని అడ్డుకున్నారు. దీంతో కాసేపు అక్కడ కనిపించిన హడావిడి వాతావరణం నెలకొంది. ఆ తర్వాత అతిథి మర్యాదలతో అఘోరికి స్వామివారి దర్శనాన్ని అధికారులు కల్పించారు.