శుక్రవారం, 10 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By సెల్వి
Last Updated : గురువారం, 17 అక్టోబరు 2024 (09:07 IST)

బోరుగడ్డ అనిల్‌ను అరెస్ట్ చేసిన పోలీసులు.. ఎందుకని?

Borugadda Anil Kumar
Borugadda Anil Kumar
బోరుగడ్డ అనిల్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. బుధవారం రాత్రి పట్టాభిపురం పోలీసులు అనిల్‌ను ఇంట్లోనే అదుపులోకి తీసుకున్నారు. రిపబ్లికన్‌ పార్టీ ఆఫ్‌ ఇండియా రాష్ట్ర అధ్యక్షుడిగా చెప్పే అనిల్‌ను బెదిరింపుల కేసులో అరెస్ట్ చేశారు. 
 
2021లో కర్లపూడి బాబుప్రకాష్‌ను రూ.50 లక్షలు ఇవ్వాలంటూ బెదిరించిన కేసులో అరెస్ట్ చేసినట్లు తెలుస్తోంది. బాధితుడి ఫిర్యాదు మేరకు అనిల్‌పై నల్లపాడు పోలీసులు కేసు నమోదు చేశారు. కొంతకాలంగా అజ్ఞాతంలో ఉన్న నిందితుడిని బుధవారం నల్లపాడు పోలీసులు అరెస్ట్ చేశారు. ఇన్నాళ్లు అజ్ఞాతంలోకి వెళ్లిన అనిల్‌ను గుంటూరులో అదుపులోకి తీసుకున్నారు.
 
బోరుగడ్డ అనిల్‌పై గత ఐదేళ్లలో ఎన్నో అరాచకాలు చేశారని టీడీపీ ఆరోపించింది. అలాగే సోషల్ మీడియా వేదికగా దూషణలకు దిగిన సందర్భాలు చాలానే ఉన్నాయి.