శుక్రవారం, 10 జనవరి 2025
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. వార్తలు
Written By ఐవీఆర్
Last Modified: బుధవారం, 16 అక్టోబరు 2024 (19:06 IST)

గుంటూరు లోని ఒమేగా హాస్పిటల్‌లో నూతన కొలొస్టమి కేర్ క్లినిక్, పెయిన్ మేనేజ్మెంట్ సెంటర్ ప్రారంభం

Doctor
గుంటూరు లోని మెహర్ నగర్ వద్ద వున్న ఒమేగా కాన్సర్ హాస్పిటల్ వద్ద ఈ రోజు ఒమేగా కాన్సర్ హాస్పిటల్ చీఫ్ సర్జికల్ అంకాలజిస్ట్, మెడికల్ డైరెక్టర్ డాక్టర్ ఎంజి నాగ కిషోర్ చేతుల మీదుగా కొలొస్టమి కేర్ క్లినిక్, పెయిన్ మేనేజ్మెంట్ సెంటర్ ప్రారంభించబడినవి. ఈ కార్యక్రమంలో ఒమేగా హాస్పిటల్ క్యాన్సర్ స్పెషలిస్ట్ హెల్త్ టీమ్‌తో పాటుగా హాస్పిటల్‌కు చెందిన నిర్వహణ బృందం, సిబ్బంది పాల్గొన్నారు. 
 
ఈ సందర్భంగా డాక్టర్ ఎంజి నాగ కిషోర్ మాట్లాడుతూ " కొలొస్టమి, దీర్ఘకాలంగా నొప్పి సమస్యలను ఎదుర్కొంటున్న రోగుల కోసం ప్రత్యేకమైన సదుపాయాలను అందించటానికి కొత్త కొలొస్టమి కేర్ క్లినిక్, దీర్ఘకాలిక నొప్పి నిర్వహణ కేంద్రాన్ని ప్రారంభించబడినది" అని తెలిపారు. ఈ క్లినిక్ ద్వారా వ్యక్తిగత కొలొస్టమి కేర్ నిపుణుల బృందం కొలొస్టమి నిర్వహణకు అవసరమైన శిక్షణ, మద్దతు అందిస్తుందని తెలిపారు. పెయిన్ మేనేజ్మెంట్ క్లినిక్ ద్వారా సాధారణంగా తీసుకునే మందుల నుంచి ప్రత్యేక చికిత్స వరకూ అన్ని రకాల నొప్పి నిర్వహణ చికిత్సలు అందించనున్నామన్నారు.