మేషం : అశ్వని, భరణి 1, 2, 3, 4 పాదములు, కృత్తిక 1వ పాదం
రావలసిన ధనం సమయానికి అందదు. అంచనాలు నిరుత్సాహపరుస్తాయి. ఆలోచనల్లో మార్పు వస్తుంది. మొక్కుబడిగా పనులు పూర్తి చేస్తారు. కొత్త సమస్యలు ఎదురయ్యే సూచనలున్నాయి. మీ శ్రీమతితో సౌమ్యంగా మెలగండి. ప్రయాణం చేయవలసి వస్తుంది.
వృషభం : కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి, మృగశిర 1, 2, పాదాలు
మాటతీరు ఆకట్టుకుంటుంది. మీ చొరవతో ఒక సమస్య పరిష్కారమవుతుంది. కొత్త యత్నాలు చేపడతారు. అవకాశాలు కలిసివస్తాయి. ధనలాభం ఉంది. దైవకార్యాలకు వ్యయం చేస్తారు. పోగొట్టుకున్న పత్రాలు లభ్యమవుతాయి. అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడవద్దు.
మిథునం : మృగశిర 3, 4 పాదాలు, ఆర్ద్ర, పునర్వసు 1, 2, 3 పాదాలు
వ్యవహారాలతో తీరిక ఉండదు. సమర్థతను చాటుకుంటారు. సభ్యత్వాల స్వీకరణకు అనుకూలం. బాధ్యతగా మెలగాలి. ఖర్చులు విపరీతం. పట్టుదలతో శ్రమించినగాని పనులు కావు. దంపతుల మధ్య సఖ్యత నెలకొంటుంది. సన్నిహితులను వేడుకకు ఆహ్వానిస్తారు.
కర్కాటకం : పునర్వసు 4వ పాదం, పుష్యమి, ఆశ్లేష
స్థిరాస్తి ధనం అందుతుంది. సకాలంలో చెల్లింపులు జరుపుతారు. సంప్రదింపులు ఫలిస్తాయి. నిలిపివేసిన పనులు పూర్తి చేస్తారు. బంధువుల వైఖరిలో మార్పువస్తుంది. కొత్త వ్యక్తులతో జాగ్రత్త. దైవదీక్షలు స్వీకరిస్తారు. పిల్లలకు ఉన్నత విద్యావకాశం లభిస్తుంది.
సింహం : మఖ, పుబ్బ, ఉత్తర 1వ పాదం
ఆలోచనలు కార్యరూపం దాల్చుతాయి. నిర్విరామంగా శ్రమిస్తారు. మీ కష్టం ఫలిస్తుంది. ఆర్థిక సమస్యలు కొలిక్కివస్తాయి. ఖర్చులు అధికం. స్థిమితంగా పనులు పూర్తి చేస్తారు. కొత్త వ్యక్తులతో జాగ్రత్త. ఒత్తిళ్లు, ప్రలోభాలకు లొంగవద్దు. ఆలయాలు సందర్శిస్తారు.
కన్య : ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త, చిత్త 1, 2 పాదాలు
వివాహయత్నాలు తీవ్రంగా సాగిస్తారు. మనోధైర్యంతో మెలగండి. ఖర్చులు విపరీతం. ముఖ్యుల కలయిక వీలుపడదు. ఆరోగ్యం బాగుంటుంది. పనులు వేగవంతమవుతాయి. సన్నిహితులను విందులకు ఆహ్వానిస్తారు. పత్రాలు, విలువైన వస్తువులు జాగ్రత్త.
తుల : చిత్త 3, 4 పాదాలు, స్వాతి, విశాఖ 1, 2, 3 పాదాలు
వ్యవహారాల్లో తప్పటడుగు వేస్తారు. అనాలోచిత నిర్ణయాలు నష్టం కలిగిస్తాయి. పెద్దల జోక్యంతో ఒక సమస్య సద్దుమణుగుతుంది. ఖర్చులు విపరీతం. ప్రియతముల గురించి ఆందోళన చెందుతారు. కార్యక్రమాలు వాయిదా పడతాయి. వాహనం ఇతరులకివ్వవద్దు.
వృశ్చికం : విశాఖ 4వ పాదం. అనూరాధ, జ్యేష్ట 1,2,3,4 పాదములు
సమయస్ఫూర్తితో మెలగండి. భేషజాలకు పోవద్దు. సంప్రదింపులు కొత్త మలుపు తిరుగుతాయి. అవతలి వారి ఆంతర్యం అవగతమవుతుంది. ఓర్పుతో శ్రమించిన గాని పనులు కావు. ఖర్చులు అదుపులో ఉండవు. వాయిదా పడిన మొక్కులు తీర్చుకుంటారు.
ధనస్సు : మూల, పూర్వాషాడ 1 2 3 4 పాదములు, ఉత్తరాషాడ 1వ పాదం
గ్రహాల సంచారం అనుకూలంగా ఉంది. పట్టుదలతో శ్రమిస్తే విజయం తథ్యం. ఆర్థికంగా బాగుంటుంది. ఆర్భాటాలకు విపరీతంగా వ్యయం చేస్తారు. కష్టమనుకున్న పనులు తేలికగా పూర్తవుతాయి. చెల్లింపుల్లో జాగ్రత్త. బ్యాంకు వివరాలు గోప్యంగా ఉంచండి.
మకరం : ఉత్తరాషాడ 2, 3, 4 పాదాలు. శ్రవణం, ధనిష్ట 1, 2 పాదాలు
లావాదేవీలతో సతమతమవుతారు. శ్రమాధిక్యత, అకాలభోజనం. ఒప్పందాల్లో మెళకువ వహించండి. ఏకపక్ష నిర్ణయాలు తగవు. అనుభవజ్ఞుల సలహా పాటించండి. ఖర్చులు విపరీతం. అవసరానికి ధనం అందుతుంది. కొత్త యత్నాలకు శ్రీకారం చుడతారు.
కుంభం : ధనిష్ట 3, 4 పాదాలు, శతభిషం, పూర్వాబాద్ర 1, 2, 3 పాదాలు
అనుకూలతలు అంతంత మాత్రమే. చిన్న విషయానికే చికాకుపడతారు. ఆప్తులతో సంభాషణ ఉత్సాహపరుస్తుంది. వ్యాపకాలు సృష్టించుకుంటారు. కొందరి రాక ఇబ్బంది కలిగిస్తుంది. పనులు, కార్యక్రమాలు వాయిదా వేసుకుంటారు. పత్రాలు అందుకుంటారు.
మీనం : పూర్వాబాద్ర 4వ పాదం, ఉత్తరాబాద్ర, రేవతి
వ్యవహారాలు మీ సమక్షంలో సాగుతాయి. మీ సలహా ఉభయులకూ ఆమోదయోగ్యమవుతుంది. అవకాశాలు కలిసివస్తాయి. ఆప్తులకు సాయం అందిస్తారు. సావకాశంగా పనులు పూర్తి చేస్తారు. పిల్లల విద్యాయత్నం ఫలిస్తుంది. ఆత్మీయులతో సంభాషిస్తారు.