మేషం : అశ్వని, భరణి 1, 2, 3, 4 పాదములు, కృత్తిక 1వ పాదం
అనుకూలతలు నెలకొంటాయి. కొత్తపనులు చేపడతారు. అవకాశాలను తక్షణం అందిపుచ్చుకోండి. అనుమానాలకు తావివ్వవద్దు. మనోధైర్యంతో వ్యవహరించండి. ఆత్మీయుల కలయిక ఉత్సాహాన్నిస్తుంది. ఖర్చులు అధికం. అవసరాలకు ధనం సర్దుబాటవుతుంది.
వృషభం : కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి, మృగశిర 1, 2, పాదాలు
సంకల్పం నెరవేరుతుంది. వాగ్ధాటితో నెట్టుకొస్తారు. కొంతమొత్తం పొదుపు చేస్తారు. పనులు సానుకూలతకు మరింత శ్రమించాలి. కొత్తవ్యక్తులను నమ్మవద్దు వ్యవహారాలు స్వయంగా చూసుకోండి. కీలక పత్రాలు, నగదు జాగ్రత్త. వేడుకల్లో అత్యుత్సాహం తగదు.
మిథునం : మృగశిర 3, 4 పాదాలు, ఆర్ద్ర, పునర్వసు 1, 2, 3 పాదాలు
పట్టుదలతో శ్రమిస్తే విజయం తధ్యం. ఆశావహదృక్పథంతో మెలగండి. నిలిపివేసిన పనులు పూర్తి చేస్తారు. ఖర్చులు విపరీతతం. పొదుపునకు ఆస్కారం లేదు. చెల్లింపుల్లో జాగ్రత్త. కనిపించకుండా పోయిన వస్తువులు లభ్యమవుతాయి. ఆత్మీయులతో సంభాషిస్తారు.
కర్కాటకం : పునర్వసు 4వ పాదం, పుష్యమి, ఆశ్లేష
అన్నివిధాలా కలిసివచ్చే సమయం. మాటతీరు ఆకట్టుకుంటుంది. ఆంతరంగిక విషయాలు వెల్లడించవద్దు. ఆర్భాటాలకు విపరీతంగా వ్యయం చేస్తారు. ముఖ్యుల కలయిక వీలుపడదు. కార్యక్రమాలు వాయిదా వేసుకుంటారు. స్థిరాస్తి వ్యవహరాల్లో మెళకువ వహించండి.
సింహం : మఖ, పుబ్బ, ఉత్తర 1వ పాదం
లావాదేవీలు కొలిక్కివస్తాయి. కొన్ని సమస్యల నుంచి బయటపడతారు. ఖర్చులు విపరీతంం. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది. పనులు, బాధ్యతలు అప్పగించవద్దు. ప్రతి విషయం క్షుణ్ణంగా తెలుసుకోవాలి. కొత్తవ్యక్తులతో జాగ్రత్త. వాయిదా పడిన మొక్కులు తీర్చుకుంటారు.
కన్య : ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త, చిత్త 1, 2 పాదాలు
ప్రతి విషయంలోను మీదే పైచేయి. అనుకున్నది సాధిస్తారు. మొండి బాకీలు వసూలవుతాయి. ఖర్చులు విపరీతం. పనులు వేగవంతమవుతాయి. ఊహించని సంఘటన ఎదురవుతుంది. నోటీసులు అందుకుంటారు. న్యాయ నిపుణులను సంప్రదిస్తారు.
తుల : చిత్త 3, 4 పాదాలు, స్వాతి, విశాఖ 1, 2, 3 పాదాలు
ఆదాయం బాగున్నా సంతృప్తి ఉండదు. ఆలోచనలతో సతమతమవుతారు. సన్నిహితుల కలయిక ఉత్సాహాన్నిస్తుంది. రోజువారీ ఖర్చులే ఉంటాయి. కొత్త పనులు చేపడతారు. దంపతుల మధ్య అన్యోన్యత నెలకొంటుంది. నగదు, విలువైన వస్తువులు జాగ్రత్త.
వృశ్చికం : విశాఖ 4వ పాదం. అనూరాధ, జ్యేష్ట 1,2,3,4 పాదములు
ఈ రోజు అనుకూలదాయకం. నిర్దిష్ట ప్రణాళికతో యత్నాలు సాగిస్తారు. పనులు సకాలంలో పూర్తిచేస్తారు. ఊహించని ఖర్చు ఎదురవుతుంది. పొదుపు ధనం అందుకుంటారు. ఫోన్ సందేశాల పట్ల అప్రమత్తంగా ఉండాలి. ఒత్తిళ్లు, ప్రలోభాలకు లొంగవద్దు.
ధనస్సు : మూల, పూర్వాషాడ 1 2 3 4 పాదములు, ఉత్తరాషాడ 1వ పాదం
మనోధైర్యంతో మెలగండి. సమస్యలు నిదానంగా సర్దుకుంటాయి. అతిగా ఆలోచించవద్దు. ఖర్చులు అంచనాలను మించుతాయి. ఆప్తుల కలయిక వీలుపడదు. మొదలెట్టిన పనులు సాగవు. మీపై శకునాల ప్రభావం అధికం. అసాంఘిక కార్యకలాపాల జోలికిపోవద్దు.
మకరం : ఉత్తరాషాడ 2, 3, 4 పాదాలు. శ్రవణం, ధనిష్ట 1, 2 పాదాలు
సంకల్పం నెరవేరుతుంది. ఉల్లాసంగా గడుపుతారు. పనులు చురుకుగా సాగుతాయి. రావలసిన ధనం అందుతుంది. పొదుపు పథకాల పట్ల ఆకర్షితులవుతారు. అజ్ఞాత వ్యక్తులతో జాగ్రత్త. ప్రలోభాలకు లొంగవద్దు. పోగొట్టుకున్న పత్రాలు తిరిగి సంపాదిస్తారు.
కుంభం : ధనిష్ట 3, 4 పాదాలు, శతభిషం, పూర్వాబాద్ర 1, 2, 3 పాదాలు
సంప్రదింపులు ఫలిస్తాయి. రావలసిన ధనం అందుతుంది. రుణసమస్య తొలగుతుంది. ఖర్చులు విపరీతం. కొత్త పనులు చేపడతారు. పిల్లలకు శుభం జరుగుతుంది. ఉల్లాసంగా గడుపుతారు. దైవకార్యంలో పాల్గొంటారు. ద్విచక్ర వాహనంపై దూరప్రయాణం తగదు.
మీనం : పూర్వాబాద్ర 4వ పాదం, ఉత్తరాబాద్ర, రేవతి
అవిశ్రాంతంగా శ్రమిస్తారు. కష్టించినా ఫలితం ఉండదు. ఆలోచనలతో సతమతమవుతారు. రోజువారీ ఖర్చులే ఉంటాయి. స్థిమితంగా పనులు పూర్తి చేస్తారు. గృహమార్పునకు యత్నిస్తారు. దంపతుల మధ్య అన్యోన్యత నెలకొంటుంది. వాయిదా పడిన మొక్కులు తీర్చుకుంటారు.
------------------------