మేషం : అశ్వని, భరణి 1, 2, 3, 4 పాదములు, కృత్తిక 1వ పాదం
అనుకూలతలున్నాయి. పట్టుదలతో శ్రమిస్తే విజయం తధ్యం. ప్రణాళికలు వేసుకుంటారు. ఖర్చులు అధికం. పనులు హడావుడిగా సాగుతాయి. గుట్టుగా మెలగండి దంపతుల మధ్య సఖ్యత నెలకొంటుంది. సోదరుల మధ్య కొత్త విషయాలు ప్రస్తావనకు వస్తాయి.
వృషభం : కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి, మృగశిర 1, 2, పాదాలు
అవిశ్రాంతంగా శ్రమిస్తారు. సమర్ధతకు ఏమంత గుర్తింపు ఉండదు. నిస్తేజానికి లోనవుతారు. మనోధైర్యంతో మెలగండి. ఖర్చులు విపరీతం. సన్నిహితులు సాయం అందిస్తారు. పనుల్లో ఒత్తిడి, శ్రమ అధికం. విలువైన వస్తువులు జాగ్రత్త. ఆత్మీయులతో సంభాషిస్తారు.
మిథునం : మృగశిర 3, 4 పాదాలు, ఆర్ద్ర, పునర్వసు 1, 2, 3 పాదాలు
సంప్రదింపులు నిరుత్సాహపరుస్తాయి. ఆలోచనలతో సతమతమవుతారు. ఖర్చులు అంచనాలను మించుతాయి. ధనసహాయం అర్ధించేందుకు మనస్కరించదు. పనులు ముందుకు సాగవు. దంపతుల మధ్య అకారణ కలహం. ఇంటి విషయాలు పట్టించుకుంటారు.
కర్కాటకం : పునర్వసు 4వ పాదం, పుష్యమి, ఆశ్లేష
వ్యవహార సామర్ధ్యంతో రాణిస్తారు. అవకాశాలు కలిసివస్తాయి. ప్రణాళికలు వేసుకుంటారు. పెద్దఖర్చు తగిలే సూచనలున్నాయి. నిలిపివేసిన పనులు పూర్తి చేస్తారు. పత్రాలు అందుకుంటారు. ఒక సమాచారం తీవ్రంగా ఆలోచింపచేస్తుంది. పెద్దలతో సంభాషిస్తారు.
సింహం : మఖ, పుబ్బ, ఉత్తర 1వ పాదం
కార్యసిద్ధికి ఓర్పు ప్రధానం. మనోధైర్యంతో అడుగు ముందుకేయండి. వివాహయత్నాలు తీవ్రంగా సాగిస్తారు. ఆశించిన సంబంధం నిరుత్సాహపరుస్తుంది. ఖర్చులు అధికం, మొక్కుబడిగా పనులు పూర్తిచేస్తారు. కొత్త వ్యక్తులతో జాగ్రత్త. బెట్టింగులకు పాల్పడవద్దు.
కన్య : ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త, చిత్త 1, 2 పాదాలు
మీదైన రంగంలో రాణిస్తారు. అందరితో సత్సంబంధాలు నెలకొంటాయి. వ్యవహారాలు మీ సమక్షంలో సాగుతాయి.. మీ సలహా ఉభయులకూ ఆమోదయోగ్యమవుతుంది. ఖర్చులు విపరీతం. చెల్లింపుల్లో జాగ్రత్త. పనులు, బాధ్యతలు అప్పగించవద్దు. సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు.
తుల : చిత్త 3, 4 పాదాలు, స్వాతి, విశాఖ 1, 2, 3 పాదాలు
గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి. పరిస్థితుల్లో మార్పు వస్తుంది. ఆలోచనలు కార్యరూపం దాల్చుతాయి. ఊహించిన ఖర్చులే ఉంటాయి. బాధ్యతలు స్వీకరిస్తారు. కొత్త పరిచయాలేర్పడతాయి. తొందరపడి హామీలివవ్వద్దు. పనుల్లో ఒత్తిడి, శ్రమ అధికం.
వృశ్చికం : విశాఖ 4వ పాదం. అనూరాధ, జ్యేష్ట 1,2,3,4 పాదములు
లావాదేవీలతో తీరిక ఉండదు. కొన్ని విషయాలు అనుకున్నట్టే జరుగుతాయి. నిలిపివేసిన పనులు పూర్తి చేస్తారు. ఖర్చులు అధికం. విలాస వస్తువులు కొనుగోలు చేస్తారు. పత్రాలు జాగ్రత్త. ఇతరుల విషయాల్లో జోక్యం తగదు. గృహమరమ్మతులు చేపడతారు.
ధనస్సు : మూల, పూర్వాషాడ 1 2 3 4 పాదములు, ఉత్తరాషాడ 1వ పాదం
ధనలాభం ఉంది. స్నేహసంబంధాలు బలపడతాయి. వ్యాపకాలు సృష్టించుకుంటారు. పనులు చురుకుగా సాగుతాయి. కొన్ని ఇబ్బందుల నుంచి బయటపడతారు. పిల్లలకు శుభం జరుగుతుంది. ముఖ్యుల కలయిక వీలుపడదు. పుణ్యకార్యంలో పాల్గొంటారు,
మకరం : ఉత్తరాషాడ 2, 3, 4 పాదాలు. శ్రవణం, ధనిష్ట 1, 2 పాదాలు
కష్టించినా ఫలితం ఉండదు. నిస్తేజానికి లోనవుతారు. ఆలోచనలు పలు విధాలుగా ఉంటాయి. ఖర్చులు విపరీతం. ఆప్తులు సాయం అందిస్తారు. ఆందోళన తగ్గి కుదుటపడతారు. సావకాశంగా పనులు పూర్తి చేస్తారు. పోగొట్టుకున్న పత్రాలు సంపాదిస్తారు.
కుంభం : ధనిష్ట 3, 4 పాదాలు, శతభిషం, పూర్వాబాద్ర 1, 2, 3 పాదాలు
కొత్త పనులకు ప్రణాళికలు వేసుకుంటారు. పరిస్థితులు అనుకూలిస్తాయి. వేడుకకు హాజరవుతారు. పనులు హడావుడిగా సాగుతాయి. ప్రముఖులతో పరిచయాలేర్పడతాయి. పిల్లల ధోరణి చికాకుపరుస్తుంది. విలువైన వస్తువులు జాగ్రత్త. ప్రయాణం తలపెడతారు.
మీనం : పూర్వాబాద్ర 4వ పాదం, ఉత్తరాబాద్ర, రేవతి
వ్యూహాత్మకంగా అడుగులేస్తారు. మీ నమ్మకం వమ్ముకాదు. కొన్ని విషయాలు అనుకున్నట్టే జరుగుతాయి. ఖర్చులు విపరీతం. చెల్లింపులు, నగదు స్వీకరణలో జాగ్రత్త. పనుల ప్రారంభంలో ఆటంకాలు ఎదురవుతాయి. కొత్తవ్యక్తులతో మితంగా సంభాషించండి.