మేషం : అశ్వని, భరణి 1, 2, 3, 4 పాదములు, కృత్తిక 1వ పాదం
	తలపెట్టిన కార్యం విజయవంతమవుతుంది. శుభకార్యాన్ని ఆర్భాటంగా చేస్తారు. మీ ఆతిధ్యం ఆకట్టుకుంటుంది. పరస్పరం కానుకలిచ్చిపుచ్చుకుంటారు. ఖర్చులు విపరీతం. రావలసిన ధనం ఆలస్యంగా అందుతుంది. అవసరాలు వాయిదా వేసుకుంటారు. ఆదివారం నాడు ఏ పనీ చేయ బుద్ధికాదు. ఆత్మీయులతో కాలక్షేపం చేస్తారు. నోటీసులు అందుకుంటారు. సోదరీ సోదరుల మధ్య కొత్త విషయాలు ప్రస్తావనకు వస్తాయి. అనాలోచిత నిర్ణయం తగదు. సంతానం దుడుకుతనం అసహనం కలిగిస్తుంది. మీ ఆగ్రహావేశాలు అదుపులో ఉంచుకోండి. మీ తప్పిదం సరిదిద్దుకోవటం శ్రేయస్కరం. వ్యాపారాలు సామాన్యంగా సాగుతాయి. ఉద్యోగస్తులకు ఏకాగ్రత ప్రధానం. నిరుద్యోగులకు ఉపాధి అవకాశం కలిగివుంది. పోగొట్టుకున్న పత్రాలు సంపాదిస్తారు. 
				  											
																													
									  
	 
	వృషభం : కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి, మృగశిర 1, 2, పాదాలు
	అన్నింటా మీరే పైచేయి. కీలక అంశాలపై పట్టుసాధిస్తారు. కొత్త పరిచయాలేర్పడతాయి. ఖర్చులు అధికం. ఆర్భాటాలకు విపరీతంగా ఖర్చుచేస్తారు. పనుల్లో ఒత్తిడి, చికాకులు అధికం. మంగళవారం నాడు ముఖ్యల కలయిక వీలుపడదు. మొండిగా పనులు ముందుకు సాగవు. ఒక ఆహ్వానం సంతోషం కలిగిస్తుంది. కనిపించకుండా పోయిన వస్తువులు లభ్యమవుతాయి. గృహనిర్మాణం పూర్తి కావస్తుంది. శుభకార్యానికి సన్నాహాలు సాగిస్తారు. పాతమిత్రులను కలుసుకుంటారు. గత సంఘటనలు అనుభూతినిస్తాయి. మీ సాయంతో ఒకరికి శుభం జరుగుతుంది. ఉద్యోగస్తులకు యూనియన్ వ్యవహారాలతో తీరిక ఉండదు. అధికారంలకు బాధ్యతల మార్పు. వ్యాపారాల్లో ఒడిదుడుకులను అధిగమిస్తారు. మీ పధకాలు ఆశించిన ఫలితాలిస్తాయి. సంస్థలు స్థాపనలకు అనుకూలం
				  
	 
	మిథునం : మృగశిర 3, 4 పాదాలు, ఆర్ద్ర, పునర్వసు 1, 2, 3 పాదాలు
	ప్రతికూలతలు అధికం. ఏ పని మొదలెట్టినా అర్థాంతంగా ముగుస్తాయి. దృఢసంకల్పంతో శ్రమించండి. కొందరి వ్యాఖ్యలు నిరుత్సాపరుస్తాయి. అపజయాలకు కుంగిపోవద్దు. పట్టుదలతో కృషి చేస్తే మంచి ఫలితం ఉంటుంది. ఆదాయానికి తగ్గట్టుగా ఖర్చుకుంటాయి. గురువారం నాడు పరిచయం లేని వారితో జాగ్రత్త బ్యాంకు వివరాలు వెల్లడించవద్దు. దంపతుల మధ్య కలహం, బంధువులతో విభేదాలు. సన్నిహితులకు మీ ఇబ్బందులు తెలియజేయండి. ఈ చికాకులు తాత్కాలికమే. ఏ విషయానికి ఆధైర్యపడవద్దు, పరిస్థితులు నిదానంగా చక్కబడతాయి. వివాహయత్నం తీవ్రంగా సాగిస్తారు. వ్యాపారాలు సామాన్యంగా సాగుతాయి. మీ పథకాలు ఏమంత ఫలితమీయవు. వృత్తి ఉద్యోగ బాధ్యతల్లో ఏకాగ్రత వహించండి. ఎట్టి పరిస్థితుల్లోను ఆత్మస్థైర్యం కోల్పోవద్దు. 
				  																								
	 
 
 
  
	
	
																		
									  
	 
	కర్కాటకం : పునర్వసు 4వ పాదం, పుష్యమి, ఆశ్లేష
	ఆర్థికంగా ఫర్వాలేదనిపిస్తుంది. ప్రణాళికలు వేసుకుంటారు. ఊహలు, అంచనాలు ఫలిస్తాయి. సన్నిహితులతో సంభాషిస్తుంటారు. ఖర్చులు అధికం, సంతృప్తికరం ఆటంకాలెదురైనా చేస్తున్న పనులు కొనసాగించండి. దూరపు బంధువులు ఆహ్వానం ఆలోచింపచేస్తుంది. అయిన వారితో సంప్రదింపులు జరుపుతారు. మీ అభిప్రాయాలకు స్పందన లభిస్తుంది. శుక్రవారం నాడు అందరితోను ఆచితూచి సంభాషించండి. మీ వ్యాఖ్యలు కొందరికి మనస్తాపం కలిగిస్తాయి. విజ్ఞతతో అవతలి వారిని ఆకట్టుకుంటారు. నిర్మాణాలు చురుకుగా సాగుతాయి. బిల్డర్లు, కాంట్రాక్టర్లకు ఆదాయం బాగుంటుంది ఉద్యోగస్తులకు బదిలీతో కూడిన పదోన్నతి, వృత్తి ఉపాధి పథకాల్లో నిలదొక్కుకుంటారు. వ్యాపారాలు ఊపందుకుంటాయి. నూతన వ్యాపారాలు ప్రారంభిస్తారు. పెద్దమొత్తం సరుకు నిల్వలో జాగ్రత్త.
				  																		
											
									  
	 
	సింహం : మఖ, పుబ్బ, ఉత్తర 1వ పాదం
	కొంతకాలం ఇబ్బందులు తొలగుతాయి. మానసికంగా స్థిమితపడతారు. ఆదాయానికి తగ్గట్టు ఖర్చులుంటాయి. పెట్టుబడులు, పొదుపు పథకాలు కలిసిరావు. కొత్త యత్నాలకు శ్రీకారం చుడతారు. గుట్టుగా మెలగండి. అది సోమ వారాల్లో పనులు సాగవు. చీటికిమాటికి చికాకు పడుతుంటారు. మీ తప్పిదాలను సరిదిద్దుకోండి. మీ అశక్తతను ఇతరుల ముందు చూపవద్దు. మీ శ్రీమతి వైఖరిలో మార్పు వస్తుంది. సంతానం దూకుడు అదుపు చేయండి. ఏ విషయాన్ని తేలికగా తీసుకోవద్దు. అత్మీయులతో సంభాషణ ఉపశమనం కలిగిస్తుంది. వివాహయత్నం ఫలించే సూచనలున్నాయి. వ్యాపారాలు ఊపందుకుంటాయి. కొత్త వాహనాలు కొనుగోలు చేస్తారు. ఉపాధ్యాయులకు కొత్త బాధ్యతలు. శుభకార్యానికి సిద్ధం అవుతారు. పరస్పరం కానుకలిచ్చిపుచ్చుకుంటారు. 
				  																	
									  
	 
	కన్య : ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త, చిత్త 1, 2 పాదాలు
	కార్యసిద్ధికి అవిశ్రాంతంగా శ్రమిస్తారు. అవకాశాలు చేజారిపోతాయి. నిరుత్సాహం వీడి ముందుకు సాగండి. మీ కృషి నిదానంగా ఫలిస్తుంది. మీ తప్పిదాలకు ఇతరులను నిందించవద్దు. విజ్ఞతతో మెలగండి. కొన్ని విషయాలు ఆందోళన కలిగిస్తాయి. చేస్తున్న పనులు అర్థాంతంగా ముగిస్తారు. మంగళవారం నాడు దుబారా ఖర్చులు విపరీతం. ప్రతి విషయం ధనంతో ముడిపడి ఉంటుంది. విలువైన వస్తువులు మరమ్మతుకు గురవుతాయి. అవగాహన లేని విషయాల్లో జోక్యం తగదు. మీ గౌరవానికి భంగం కలుగకుండా మెలగండి. దంపతుల మధ్య అకారణ కలహం. ఆప్తుల రాకతో సమస్య సద్దుమణుగుతుంది. వృత్తి వ్యాపారాలు సామాన్యంగా సాగుతాయి. మీ పథకాలు ఆశించిన ఫలితాలను ఇవ్వవు. ఉద్యోగస్తులకు పనిఒత్తిడి, విశ్రాంతి లోపం. కంప్యూటర్, ప్రింటింగ్ రంగాల వారికి ఆశాజనకం.
				  																	
									  
	 
	తుల : చిత్త 3, 4 పాదాలు, స్వాతి, విశాఖ 1, 2, 3 పాదాలు
	లక్ష్యానికి చేరవవుతారు. ఆశాజనకంతో మెలగండి. ఖర్చులు విపరీతం ధనసమస్యలెదురవుతాయి. అవసరాలు వాయిదా వేసుకుంటారు. చేపట్టిన పనులు కొనసాగించండి. దంపతుల మధ్య అవగాహన లోపం, చిన్న విషయానికే చికాకుపడతాడు. మీ ఆగ్రహావేశాలు అదుపులో ఉంచుకోండి. అతిగా ఆలోచింపవద్దు, వ్యాపకాలు సృష్టించుకోవటం శ్రేయస్కరం. వీలైనంత వరకు ఆప్తులతో కాలక్షేపం చేయండి. సంతానం కృషి ఫలిస్తుంది. మానసికంగా కుదుటపడతారు. పత్రాల రెన్యువల్లో జాప్యం తగదు. వృత్తుల వారికి సామాన్యం, ఉపాధి పథకాలు కలిసివస్తాయి. నిరుద్యోగులకు ఇంటర్వ్యూల్లో ఏకాగ్రత ముఖ్యం వ్యాపారాల్లో స్వల్ప ఒడిదుడుకులు ఎదురవుతాయి. ప్రస్తుత వ్యాపారాలే కొనసాగించండి. ఉద్యోగస్తులకు ఒత్తిడి, పనిభారం వాహననడిపేటపుడు జాగ్రత్త.
				  																	
									  
	 
	వృశ్చికం : విశాఖ 4వ పాదం. అనూరాధ, జ్యేష్ట 1, 2, 3, 4 పాదములు
	ఓ శుభవార్త సంతోషం కలిగిస్తుంది. తలపెట్టిన కార్యం నెరవేరుతుంది. వ్యూహ్యాత్మకంగా అడుగు ముందుకేస్తారు. ఆదాయం బాగుంటుంది. ఆర్భాటాలకు వివరీతంగా ఖర్చు చేస్తారు. పనుల్లో ఒత్తిడి, శ్రమ అధికం, శుక్రవారం నాడు కావలసిన వ్యక్తుల కలయిక వీలుపడదు. ముఖ్యమైన కార్యక్రమాలు వాయిదా పడతాయి. దంపతుల మధ్య అవగాహన లోపం. పట్టింపులకు పోవద్దు. సహనమే మీకు శ్రీరామరక్ష. మీ విషయాల్లో ఇతరుల జోక్యనికి తావివ్వద్దు, నోటీసులు అందుకుంటారు. సోదరుల మధ్య కొత్త విషయాలు చర్చకువస్తాయి. న్యాయనిపుణులను ఆశ్రయిస్తారు. నిరంతర కృషి ఫలిస్తుంది. ధార్మిక విషయాల పట్ల దృష్టిపెడతారు. వృత్తి వ్యాపారాలు సామాన్యంగా సాగుతాయి. ఉద్యోగస్తులు అలక్ష్యం తగదు. అధికారులకు వివరణ ఇచ్చుకోవలసి వస్తుంది. 
				  																	
									  
	 
	ధనస్సు : మూల, పూర్వాషాడ 1, 2, 3, 4 పాదములు, ఉత్తరాషాడ 1వ పాదం
	అన్ని విధాలా అనుకూలమే. ఇచ్చిన మాట నిలబెట్టుకుంటారు. బంధుమిత్రులు మీ చిత్తశుద్ధిని అర్ధం చేసుంటారు. శనివారం నాడు పనులు ఒక పట్టాన సాగవు. చిన్న విషయానికే చికాకు పడతారు. స్థిమితంగా వుండేందుకు ప్రయత్నించండి. ఆదాయం బాగుంటుంది. ప్రణాళికలు వేసుకుంటారు. సంస్థల స్థాపనలకు అనుమతులు మంజూరవుతాయి. ఒక సంఘటన మీపై పభావం చూపుతుంది. దూరపు బంధువుల రాక ఆశ్చర్యం కలిగిస్తుంది. కొత్తయత్నాలను శ్రీకారం చుడతారు. అవకాశం కలిసివస్తుంది. అనుమానాలు, ఆపోహలకు తావివ్వవద్దు, వ్యాపారాలు ఊపందుకుంటాయి. అటుపోట్లకు ధీటుగా స్పందిస్తారు. ఉద్యోగస్తులకు పదవీయోగం ఉంది. సమావేశంలో ప్రముఖంగా పాల్గొంటారు. 
				  																	
									  
	 
	మకరం : ఉత్తరాషాడ 2, 3, 4 పాదాలు. శ్రవణం, ధనిష్ట 1, 2 పాదాలు
	ప్రతికూలతలతో సతమతమవుతారు. ఏ విషయంపై ఆసక్తి ఉండదు. ఆలోచనలు పలు విధాలుగా ఉంటాయి. అన్యమనస్కంగా గడుపుతారు. ఆదాయం బాగున్న సంతృప్తి ఉండదు. తెలియని వెలితి వెంటాడుతుంది. ఖర్చులు అధికం. డబ్బుకు ఇబ్బంది వుండదు. సోమవారం నాడు చేసిన పనులే చేయవలసి వస్తుంది. మీపై శకునాల ప్రభావం అధికం. మీ శ్రీమతి ప్రోత్సాహంతో కొత్తయత్నాలు మొదలెడతారు. గృహమార్పు అనివార్యం. ఒక సమాచారం ఉత్సాహపరుస్తుంది. సమయస్ఫూర్తితో వ్యవహరిస్తారు. సంతానం దూకుడు అదుపుచేయండి. వ్యాపారాల్లో లాభనష్టాలు సమీక్షించుకుంటారు. నూతన పెట్టుబడులు కలిసిరావు. ఉద్యోగ, ఉపాధ్యాయులకు సమయపాలన ప్రధానం. సాంకేతిక రంగాల వారికి సదవకాశాలు లభిస్తాయి. 
				  																	
									  
	 
	కుంభం : ధనిష్ట 3, 4 పాదాలు, శతభిషం, పూర్వాబాద్ర 1, 2, 3 పాదాలు
	ఆశావహదృక్పథంతో మెలగండి. ఏ విషయాన్నీ తేలికగా తీసుకోవద్దు. మనోబలంతో శ్రమిస్తేనే లక్ష్యం సిద్ధిస్తుంది. రాబోయే ఆదాయానికి తగ్గట్టుగా ఖర్చులుంటాయి. వీలైనంత వరకు ఖర్చులు తగ్గించుకోండి. ఆత్మీయుల హితవు కార్యోన్ముఖులను చేస్తుంది. కొత్త ఉత్సాహంతో ముందుకు సాగుతారు. శకునాలు పట్టించుకోవద్దు, పనుల్లో ఆటంకాలెదురైనా కొనసాగించండి. వాస్తుదోష నివారణ చర్యలు అనివార్యం, గృహోపకరణాలు, వాహనం మరమ్మతుకు గురవుతాయి. ఇతరుల విషయాల్లో జోక్యం తగదు. మీ గౌరవానికి భంగం కలుగకుండా మెలగండి. పత్రాల్లో మార్పులు అనుకూలిస్తాయి. ఉపాధి పధకాలు చేపడతారు. వృత్తుల వారికి ఆదాయాభివృద్ధి వ్యాపారాలు ఊపందుకుంటాయి. ఉద్యోగస్తులు అధికారులను ప్రసన్నం చేసుకుంటారు.
				  																	
									  
	 
	మీనం : పూర్వాబాద్ర 4వ పాదం, ఉత్తరాబాద్ర, రేవతి
	ఈ వారం కొంతమేరకు అవిశ్రాంతంగా శ్రమిస్తారు. మీ కృషి నిదాసంగా ఫలిస్తుంది. దూరపు బంధుత్వాలు బలపడతాయి. ఒక సమాచారం ఉపశమనం కలిగిస్తుంది. ఆదాయ వ్యయాలకు పొంతన ఉండదు. పెద్దఖర్చు తగిలే సూచనలున్నాయి. వ్యవహారాల్లో ఏకాగ్రత వహించండి. తొందరపాటు నిర్ణయం నష్టం కలిగిస్తుంది. నిపుణులను సంప్రదించండి. పనుల్లో ఆటంకాలెదురైనా మొండిగా పూర్తి చేస్తారు. దంపతుల మధ్య పరస్పర అవగాహన నెలకొంటుంది. వివాహయత్నం తీవ్రంగా సాగిస్తారు. మధ్యవర్తులను ఆశ్రయించవద్దు. ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి. వ్యాపారాలు మందకొడిగా సాగుతాయి. ప్రస్తుత వ్యాపారాలే శ్రేయస్కరం. ఉద్యోగ విధులను సమర్థంగా నిర్వహిస్తారు. ప్రైవేట్ ఉద్యోగస్తులకు మార్పులు అనివార్యం. వృత్తి ఉపాధి దిశగా అడుగులేస్తారు.