బుధవారం, 15 అక్టోబరు 2025
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. వారఫలం
Written By రామన్
Last Updated : శనివారం, 11 అక్టోబరు 2025 (23:21 IST)

12-10-2025 నుంచి 18-10-2025 వరకు ఫలితాలు-జాతక పొంతన...

Weekly Horoscope
మేషం : అశ్వని, భరణి 1, 2, 3, 4 పాదములు, కృత్తిక 1వ పాదం
ఆర్థిక విషయాల్లో అనుకూల ఫలితాలున్నాయి. స్వయంకృషితో అనుకున్నది సాధిస్తారు. ఆదాయానికి తగ్గట్టుగా ఖర్చులుంటాయి. పెట్టుబడులు కలిసిరావు. సన్నిహితులతో కాలక్షేపం చేస్తారు. ఆదివారం నాడు పనులు సాగవు. దంపతుల మధ్య చిరుకలహం. సామరస్యంగా మెలగండి. చిన్న విషయాన్ని పెద్దది చేసుకోవద్దు. ఆత్మీయులతో తరుచుగా సంభాషిస్తారు. పత్రాల్లో మార్పులు అనుకూలిస్తాయి. వివాహయత్నాలు తీవ్రంగా సాగిస్తారు. కన్సల్టెన్సీలు, మధ్యవర్తులను ఆశ్రయించవద్దు. ఆరోగ్యం స్థిరంగా ఉంటుంది. సంతానం అత్యుత్సాహం కట్టడి చేయండి. అయిన వారి జోక్యంతో సమస్య సద్దుమణుగుతుంది. వ్యాపారాలు ఊపందుకుంటాయి. ఉద్యోగ విధులను సమర్ధంగా నిర్వహిస్తారు. అధికారులకు హోదామార్పు. ఆధ్యాత్మికత పెంపొందుతుంది. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. 
 
వృషభం : కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి, మృగశిర 1, 2, పాదాలు
లక్ష్యసాధనకు మరింత శ్రమించాలి. యత్నాలు విరమించుకోవద్దు. మీ సమర్థతపై నమ్మకం పెంచుకోండి. అయిన వారు సాయం అందిస్తారు. చేస్తున్న పనులపై దృష్టిపెట్టండి. మీ ఏమరుపాటు ఇబ్బంది కలిగిస్తుంది. ఖర్చులు అదుపులో ఉండవు. అవసరాలు వాయిదా వేసుకుంటారు. చెల్లింపుల్లో అలక్ష్యం తగదు. మంగళవారం నాడు పనులు ముందుకు సాగవు. మీపై శకునాల ప్రభావం అధికం. ఒక సమాచారం ఆలోచింపచేస్తుంది. ఆత్మీయులతో సంభాషిస్తారు. మీ శ్రీమతిలో మార్పు వస్తుంది. అవివాహితులకు శుభయోగం. కనిపించకుండా పోయిన వస్తువులు లభ్యమవుతాయి. ప్రైవేట్ ఉద్యోగస్తులకు ఓర్పు, ఏకాగ్రత ప్రధానం. వ్యాపారాల్లో లాభనష్టాలు సమీక్షించుకుంటారు. ఉపాధి అవకాశాలు కలిసివస్తాయి. శుభకార్యానికి హాజరవుతారు. బంధుత్వాలు బలపడతాయి. 
 
మిథునం : మృగశిర 3, 4 పాదాలు, ఆర్ద్ర, పునర్వసు 1,2,3 పాదాలు
ఆర్ధికలావాదేవీలు ముగుస్తాయి. రుణసమస్యకు పరిష్కారం లభిస్తుంది. మానసికంగా కుదుటపడతారు. గృహం ప్రశాంతంగా ఉంటుంది. శనివారం నాడు చేసిన పనులే తిరిగి చేయవలసి వస్తుంది. చిన్న విషయానికే చికాకుపడతారు. ఖర్చులు అధికం, ప్రయోజనకరం. ఇంటి విషయాలపై దృష్టిపెడతారు. అప్రయత్నంగా అవకాశాలు కలిసివస్తాయి. ప్రముఖులకు సన్నిహితులవుతారు. కిట్టని వారితో జాగ్రత్త. ఫోన్ సందేశాలు పట్టించుకోవద్దు. సంతానం కృషి ఫలిస్తుంది. ఆత్మీయులతో ఉత్సాహంగా గడుపుతారు. పత్రాల్లో సవరణలు సాధ్యపడతాయి. దూరపు బంధువులను కలుసుకుంటారు. వృత్తి వ్యాపారాలు ప్రోత్సాహకరంగా సాగుతాయి. ఉపాధ్యాయులకు పదోన్నతి. ఉపాధి పథకాల్లో నిలదొక్కుకుంటారు. సొంతంగా ఏదైనా చేయాలనే ఆలోచన కార్యరూపం దాల్చుతుంది. 
 
కర్కాటకం : పునర్వసు 4వ పాదం, పుష్యమి, ఆశ్లేష
సంకల్పబలంతో చేసే యత్నాలు ఫలిస్తాయి. మిమ్ములను తక్కువ అంచనా వేసుకోవద్దు. కొందరి వ్యాఖ్యలు నిరుత్సాహపరుస్తాయి. ఆశావహదృక్పధంతో ముందుకు సాగండి. సాయం ఆశించవద్దు. ఆదాయం ఫర్వాలేదనిపిస్తుంది. ఖర్చులు తగ్గించుకుంటారు. మంగళవారం నాడు ముఖ్యుల కలయిక వీలుపడదు. దూరపు బంధువుల ఆహ్వానం అందుకుంటారు. దంపతుల మధ్య అవగాహన నెలకొంటుంది. కొత్త విషయాలు తెలుసుకుంటారు. స్థిరచరాస్తుల వ్యవహారంలో జాగ్రత్త. మధ్యవర్తులను అతిగా నేమ్మవద్దు. ప్రతి విషయం క్షుణ్ణంగా తెలుసుకోండి. వృత్తి ఉద్యోగాల్లో మంచి ఫలితాలున్నాయి. మీ పదోన్నతికి అధికారులు సహకరిస్తారు. వ్యాపారాల్లో ఆశించిన లాభాలు గడిస్తారు. సొంత వ్యాపారాలే శ్రేయస్కరం. ధార్మికత పట్ల ఆసక్తి కలుగుతుంది. ఆలయాలకు విరాళాలందిస్తారు. 
 
సింహం : మఖ, పుబ్బ, ఉత్తర 1వ పాదం
శుభఫలితాలు గోచరిస్తున్నాయి. తలపెట్టిన కార్యం నెరవేరుతుంది. సంబంధ బాంధవ్యాలు బలపడతాయి. సమయస్ఫూర్తితో అవకాశాలను చేజిక్కించుకుంటారు. పనుల్లో ఒత్తిడి, శ్రమ అధికం. బాధ్యతలు అప్పగించవద్దు. అనవసర జోక్యం ఇబ్బంది కలిగిస్తుంది. ఆదాయం సంతృప్తికరం. ఊహించిన ఖర్చులే ఉంటాయి. పెట్టుబడులపై దృష్టి పెడతారు. ధనసహాయం, ప్రైవేట్ సంస్థల్లో మదుపు తగదు. మీ శ్రీమతికి అన్ని విషయాలు తెలియజేస్తారు. ఒక సమాచారం ఉల్లాసాన్నిస్తుంది. కొత్తయత్నాలు మొదలెడతారు. సలహాలు, సాయం ఆశించవద్దు. సోదరులతో సంప్రదింపులు జరుపుతారు. వ్యాపారాలు ప్రోత్సాహకరంగా సాగుతాయి. సొంత వ్యాపారాలే శ్రేయస్కరం. ఉద్యోగ బాధ్యతల పట్ల శ్రద్ధవహిస్తారు. ప్రైవేట్ ఉద్యోగస్తులకు మార్పులు అనుకూలిస్తాయి. వాహనం అమర్చుకోవాలనే కోరిక నెరవేరుతుంది. 
 
కన్య : ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త, చిత్త 1, 2 పాదాలు
యత్నాలు ప్రోత్సాహకరంగా సాగుతాయి. పెద్దల ఆశీస్సులు అందుకుంటారు. కష్టమనుకున్న పనులు సునాయాసంగా పూర్తి చేస్తారు. మీ చొరవతో శుభకార్యం నిశ్చయమవుతుంది. ఆత్మీయులతో కాలక్షేపం చేస్తారు. ఆదాయ వ్యయాలకు పొంతన ఉండదు. ఆర్భాటాలకు విపరీతంగా ఖర్చుచేస్తారు. నగదు డ్రా చేసేటపుడు జాగ్రత్త. సంతానం దూకుడు అదుపు చేయండి. అనవసర విషయాల జోలికి పోవద్దు. మీ ఇష్టాయిష్టాలను లౌక్యంగా తెలియజేయండి. ఇతరుల విషయాలు తెలుసుకోవాలన్న ఆసక్తి తగదు. నోటీసులు అందుకుంటారు. ఒక సమాచారం ఆందోళన కలిగిస్తుంది. వ్యాపారాలు క్రమంగా ఊపందుకుంటాయి. కొన్ని ఇబ్బందులు నుంచి బయటపడతారు. ఉపాధ్యాయులకు ఓర్పు, సమయపాలన ప్రధానం. సాఫ్ట్‌వేర్ ఉద్యోగస్తులకు ఒత్తిడి, విశ్రాంతి లోపం.
 
తుల : చిత్త 3, 4 పాదాలు, స్వాతి, విశాఖ 1, 2, 3 పాదాలు
లక్ష్యం నెరవేరుతుంది. విమర్శలకు దీటుగా స్పందిస్తారు. కొత్తయత్నాలకు శ్రీకారం చుడతారు. పరిచయాలు ఉన్నతికి తోడ్పడతాయి. బుధవారం నాడు ఆచితూచి అడుగు వేయండి. కొన్ని విషయాలు పటించుకోవద్దు. అర్థాంతంగా ముగించిన పనులు పూర్తిచేస్తారు. గృహం ప్రశాంతంగా ఉంటుంది. ఆదాయం ఫర్వాలేదనిపిస్తుంది. రోజువారీ ఖర్చులే ఉంటాయి. పరిచయస్తులు ధనసహాయం అర్ధిస్తారు. కొంతమొత్తం సాయం చేయండి. దూరపు బంధువులతో సంభాషిస్తారు. మీ సాయంతో ఒకరికి మంచి జరుగుతుంది. ఆరోగ్యం జాగ్రత్త. అతిగా ఆలోచింపవద్దు. ఆహార నియమం క్రమం తప్పకుండా పాటించండి. వృత్తి ఉపాధి పథకాలు పురోగతిన సాగుతాయి. వ్యాపారంలో ఆశాజనకమైన ఫలితాలున్నాయి. నూతన వ్యాపారాలకు అనుకూల సమయం. సరుకు నిల్వలో జాగ్రత్త. 
 
వృశ్చికం : విశాఖ 4వ పాదం. అనూరాధ, జ్యేష్ట 1,2,3,4 పాదములు
ఆర్థికంగా ఆశించిన ఫలితాలున్నాయి. రావలసిన ధనం అందుతుంది. కొంతమొత్తం పొదుపు చేస్తారు. స్నేహసంబంధాలు బలపడతాయి. వాక్పటిమతో నెట్టుకొస్తారు. శుక్రవారం నాడు చేసిన పనులే చేయవలసి వస్తుంది. దంపతుల మధ్య స్వల్ప కలహం. చిన్న విషయాన్ని పెద్దది చేసుకోవద్దు. గృహమరమ్మతులు చేపడతారు. విలువైన వస్తువులు మరమ్మతుకు గురవుతాయి. ఆత్మీయులతో సంభాషణ ఉపశమనం కలిగిస్తుంది. అవివాహితులకు శుభయోగం. మీ సిఫార్సుతో ఒకరికి సదావకాశం లభిస్తుంది. ఉద్యోగ బాధ్యతలను సమర్థంగా నిర్వహిస్తారు. మీ పనితీరును అధికారులు ప్రశంసిస్తారు. నిరుద్యోగులకు ఇంటర్వ్యూలు సంతృప్తినీయవు. వ్యాపారాల్లో ఆశించిన లాభాలు గడిస్తారు. న్యాయవాదుల ఆదాయం బాగుంటుంది. శుభకార్యానికి హాజరవుతారు. 
 
ధనస్సు : మూల, పూర్వాషాడ 1 2 3 4 పాదములు, ఉత్తరాషాడ 1వ పాదం
గ్రహాల సంచారం అనుకూలంగా ఉంది. అన్ని రంగాల వారికీ యోగదాయకమే. వ్యవహారాలను సమర్ధంగా నిర్వహిస్తారు. తలపెట్టిన కార్యం నిర్విఘ్నంగా సాగుతుంది. ఖర్చులు అధికం, సంతృప్తికరం. పొదుపు పథకాలపై దృష్టిపెడతారు. పెద్దమొత్తం ధనసహాయం తగదు. మంగళవారం నాడు మితంగా సంభాషించండి. ఒకరి వద్ద మరొకరి ప్రస్తావన తగదు. వాయిదా పడుతున్న పనులు ఎట్లకేలకు పూర్తవుతాయి. దూరపు బంధువులతో సంభాషిస్తారు. వివాహయత్నం ఫలించే సూచనలున్నాయి. జాతక పొంతన పట్టించుకోవద్దు. మీ ఇష్టాయిష్టాలను లౌక్యంగా తెలియజేయండి. వ్యాపారాలు పురోగతిన సాగుతాయి. ఆటుపోట్లకు ధీటుగా స్పందిస్తారు. ఉద్యోగస్తుల పనితీరు అధికారులను ఆకట్టుకుంటుంది. వేడుకకు హాజరవుతారు. ఇంటిని నిర్లక్ష్యంగా వదిలి వెళ్లకండి. 
 
మకరం : ఉత్తరాషాడ 2, 3, 4 పాదాలు. శ్రవణం, ధనిష్ట 1, 2 పాదాలు
కార్యసిద్ధికి మరింత శ్రమించాలి. చేపట్టిన పనుల్లో ఏకాగ్రత వహించండి. ఒత్తిడికి గురికావద్దు. మీ యత్నాలను ఆప్తులు ప్రోత్సహిస్తారు. కొంతమొత్తం ధనం అందుతుంది. మానసికంగా నిలదొక్కుకుంటారు. చెల్లింపుల్లో జాప్యం తగదు. ఆచితూచి అడుగు వేయండి. దంపతుల మధ్య ఏకాభిప్రాయం నెలకొంటుంది. ఆహ్వానం, నోటీసులు అందుకుంటారు. ఒక సమాచారం ఆలోచింపచేస్తుంది. మీ సమస్యలకు సన్నిహితులకు తెలియజేయండి. సంతానం కృషి ఫలిస్తుంది. ఆరోగ్యం జాగ్రత్త. కనిపించకుండా పోయిన వస్తువులు లభ్యమవుతాయి. ఆత్మీయులతో కాలక్షేపం చేస్తారు. ఫోన్ సందేశాలు పట్టించుకోవద్దు. అజ్ఞాతవ్యక్తులు మోసగించే ఆస్కారం ఉంది. వ్యాపారాలు సామాన్యంగా సాగుతాయి. ఉద్యోగ బాధ్యతల పట్ల శ్రద్ధ వహించండి. సామాజిక కార్యక్రమంలో పాల్గొంటారు. 
 
కుంభం : ధనిష్ట 3, 4 పాదాలు, శతభిషం, పూర్వాబాద్ర 1, 2, 3 పాదాలు
ముఖ్యమైన వ్యవహరాల్లో తొందరపాటు తగదు. చేస్తున్న పనులపై దృష్టిపెట్టండి. యాదృచ్ఛికంగా తప్పులు దొర్లే ఆస్కారం ఉంది. సమయస్పూర్తితో ఒక సమస్యను అధిగమిస్తారు. ఆదాయం బాగున్నా సంతృప్తి ఉండదు. తెలియని వెలితి వెన్నాడుతుంది. ఆత్మీయులతో తరుచు సంభాషిస్తుంటారు. మీపై నమ్మకం లేని వారిని దూరంగా ఉంచండి. మీ సమర్ధతకు నిదానంగా గుర్తింపు లభిస్తుంది. వివాహయత్నం తీవ్రంగా సాగిస్తారు. కలిసివచ్చిన సంబంధాన్ని తక్షణం కుదుర్చుకోండి. పెద్దల హితవు మీపై పనిచేస్తుంది. ప్రైవేట్ ఉద్యోగస్తులకు కష్టసమయం. అధికారులకు బాధ్యతల మార్పు. వ్యాపారాభివృద్ధికి పథకాలు వేస్తారు. నూతన వ్యాపారాలు వాయిదా వేయండి. చిరువ్యాపారులకు ఆశాజనకం. న్యాయవాదులకు ఆదాయాభివృద్ధి. రాజీమార్గంలో వివాదాలు పరిష్కరించుకుంటారు. 
 
మీనం : పూర్వాబాద్ర 4వ పాదం, ఉత్తరాబాద్ర, రేవతి 
శుభసమయం సమీపిస్తోంది. నిరుత్సాహం వీడి యత్నాలు సాగించండి. లక్ష్యానికి చేరువవుతారు. పనుల సానుకూలతకు లౌక్యం, కృషి ప్రధానం. ఆదాయ వ్యయాలకు పొంతన ఉండదు. శనివారం నాడు దుబారా ఖర్చులు విపరీతం. కొత్త సమస్యలు ఎదురయ్యే సూచనలున్నాయి, అందరితోనూ మితంగా సంభాషించండి. అనవసర విషయాల్లో జోక్యం తగదు. అవివాహితులకు శుభవార్తా శ్రవణం. దంపతుల మధ్య ఏకాభిప్రాయం నెలకొంటుంది. తెగిపోయిన బంధుత్వాలు బలపడతాయి. పెద్దల గురించి ఆందోళన చెందుతారు. కార్యక్రమాలు ముందుకు సాగవు. వ్యాపారాలు పుంజుకుంటాయి. ఉమ్మడిగా కంటే సొంత వ్యాపారాలే శ్రేయస్కరం. ఉద్యోగ విధుల్లో తప్పిదాలను సరిదిద్దుకుంటారు. ఉపాధి పథకాలు ప్రోత్సాహకరంగా సాగుతాయి. వాహనం నడిపేటపుడు జాగ్రత్త.