శుక్రవారం, 10 జనవరి 2025
  1. వార్తలు
  2. బిజినెస్
  3. వార్తలు
Written By ఠాగూర్
Last Updated : శుక్రవారం, 1 నవంబరు 2024 (18:20 IST)

అక్టోబరు నెలలో రికార్డు స్థాయిలో జీఎస్టీ వసూళ్లు

gstimage
ముగిసిన అక్టోబరు నెలలో రికార్డు స్థాయిలో జీఎస్టీ వసూళ్లు నమోదయ్యాయి. గత యేడాదితో పోల్చితే ఈ దఫా వసూళ్ల వృద్ధి 8.9 శాతంగా ఉంది. అలాగే, సెప్టెంబరు నెలతో పోల్చితే ఈ వృద్ధిరేటు 8.1 శాతంగా ఉంది. సీజీఎస్టీ రూపంలో రూ.33821 కోట్లు, ఎసీజీఎస్టీ రూపంలో రూ.41864 కోట్లు, ఐజీఎస్టీ రూపంలో రూ.99111 కోట్లు చొప్పున వసూలయ్యాయి. 2024లో ఇప్పటివరకు నమోదైన వసూళ్లు రూ.12.74 లక్షల కోట్లుగా ఉంది. 
 
అక్టోబరు-2024 జీఎస్టీ వసూళ్లు రూ.1.87 లక్షల కోట్లుగా నమోదయ్యాయి. గత ఏడాది అక్టోబరుతో పోలిస్తే 8.9 శాతం, సెప్టెంబర్ నెలతో పోలిస్తే 8.1 శాతం వృద్ధి నమోదైంది. గత ఏడాది అక్టోబరు నెలలో రూ.1.72 లక్షల జీఎస్టీ వసూళ్లు నమోదయ్యాయి.
 
రూ.1,87,346 కోట్ల జీఎస్టీ వసూళ్లలో రూ.33,821 కోట్లు సీజీఎస్టీ కాగా, రూ.41,864 కోట్లు ఎసీజీఎస్టీ, రూ.99,111 కోట్లు ఐజీఎస్టీ రూపంలో వసూలయ్యాయి. సెస్‌ల రూపంలో మరో రూ.12,550 కోట్లు వచ్చాయి. జీఎస్టీ వసూళ్లలో పెరుగుదల మెరుగైన ఆర్థిక కార్యకలాపాలు, పన్ను వసూలు సామర్థ్యాన్ని సూచిస్తుంది.
 
దేశీయ లావాదేవీలు 10.6 శాతం వృద్ధి చెంది రూ.1.42 లక్షల కోట్లుగా నమోదయ్యాయి. దిగుమతులపై విధించిన పన్నులు 4 శాతం పెరిగి రూ.45,096 కోట్లుగా నమోదయ్యాయి.
 
2024 క్యాలెండర్ యేడాదిలో ఇప్పటివరకు నమోదైన మొత్తం జీఎస్టీ వసూళ్లు రూ.12.74 లక్షల కోట్లు. 2023లో ఇదేకాలంలో నమోదైన రూ.11.64 లక్షల కోట్లతో పోలిస్తే ఈ యేడాది 9.4 శాతం వృద్ధి నమోదైంది.