శుక్రవారం, 10 జనవరి 2025
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. కథనాలు
Written By సిహెచ్
Last Modified: సోమవారం, 14 అక్టోబరు 2024 (20:52 IST)

ఐరన్ లోపం వున్నవాళ్లు ఈ పదార్థాలు తింటే ఎంతో మేలు, ఏంటవి?

ఐరన్ లోపం అనేది చాలా మంది స్త్రీలలో ఒక సాధారణ ఆరోగ్య పరిస్థితి. ఈ సమస్యకు చికిత్స చేయకుండా వదిలేస్తే తీవ్రమైన చిక్కులను తెస్తుంది. అయితే, ఇనుము గురించి మంచి విషయం ఏమిటంటే ఇది ఆహారం మీద ఆధారపడి ఉంటుంది. ఈ క్రింద తెలుపబడిన ఆహారాన్ని తీసుకుంటుంటే శరీరంలో క్రమంగా ఐరన్ స్థాయిలు పెరుగుతాయి. అవేంటో తెలుసుకుందాము.
 
బచ్చలి కూరలో ఐరన్ కంటెంట్ ఎక్కువ. సలాడ్లు, స్మూతీలు లేదా వండిన వంటలలో బచ్చలికూరను చేర్చుకుంటే సమస్య నుంచి బైటపడవచ్చు.
రెడ్ మీట్ మితంగా తీసుకుంటుంటే ఇనుముతో పాటు ప్రోటీన్, బి విటమిన్లు వంటి అవసరమైన పోషకాలను అందిస్తుంది.
కాయధాన్యాలులో ప్రోటీన్, ఫైబర్లు ఇనుము స్థాయిలను మెరుగుపరచడంలో సహాయపడటమే కాక జీర్ణ ఆరోగ్యానికి మేలు చేస్తాయి.
గుమ్మడికాయ గింజల లోని అధిక యాంటీఆక్సిడెంట్ కంటెంట్, ఆరోగ్యకరమైన కొవ్వులు ఆరోగ్యానికి దోహదం చేస్తాయి.
క్వినోవా మెగ్నీషియం, మాంగనీస్, ఫైబర్‌తో సహా ఇతర అవసరమైన పోషకాలను అందిస్తుంది.
డార్క్ చాక్లెట్‌లో ఐరన్ సమృద్ధిగా ఉంటుంది, ఇది అదనపు యాంటీఆక్సిడెంట్లను అందిస్తుంది.
శనగలులో ఫైబర్, ప్రోటీన్లు వుంటాయి, వీటిని తింటుంటే ఇనుము స్థాయిలను మెరుగుపరచడంలో సహాయపడుతుంది.