శుక్రవారం, 10 జనవరి 2025
  1. వార్తలు
  2. బిజినెస్
  3. వార్తలు
Written By ఐవీఆర్
Last Modified: బుధవారం, 11 సెప్టెంబరు 2024 (15:43 IST)

మొట్ట మొదటి బ్రైలీ AC రిమోట్ కవర్‌ను విడుదల చేసిన LG

image
భారతదేశంలో ప్రముఖ వినియోగదారు డ్యూరబుల్ బ్రాండ్ LG ఎలక్ట్రానిక్స్, తమ మొట్ట మొదటి బ్రైలీ AC రిమోట్ కవర్  విడుదల గురించి గర్వంగా ప్రకటించింది. అంధుల వర్గాన్ని మద్దతు చేయడానికి ఇది కొత్తగా రూపొందించబడిన చొరవ. ఈ వినూత్నత  LG ఎయిర్ కండిషనర్స్ ను స్వతంత్రంగా ఆపరేట్ చేయడానికి సాధికారత కల్పిస్తుంది, వారి యూజర్ అనుభవాన్ని మెరుగుపరుస్తుంది  మరియు చేరికను ప్రోత్సహిస్తుంది. ప్రారంభోత్సవపు కార్యక్రమానికి నేషనల్ అసోసియేషన్ ఫర్ ద బ్లైండ్ (NAB) మరియు LG నాయకత్వం నుండి ప్రతినిధులు సహా గౌరవనీయులైన అతిథులు హాజరయ్యారు. కార్యక్రమంలో బ్రైలీ AC రిమోట్ కవర్ లైవ్ ప్రదర్శన ప్రధాన ఆకర్షణగా నిలిచింది, అంధులు LG ఎయిర్ కండిషనర్స్ ను ఆపరేట్ చేసే విధానాన్ని ఏ విధంగా ఉత్పత్తి విప్లవీకరించిందో ఇది చూపించింది.

27 సంవత్సరాలుగా, LG ఎలక్ట్రానిక్స్ కస్టమర్ల వృద్ధి చెందుతున్న అవసరాలను నెరవేర్చడానికి  రూపొందించబడిన ఆధునిక గృహోపకరణాలను మరియు వినోదపు పరిష్కారాలను తయారు చేస్తోంది.ఈ సరికొత్త చొరవ టెక్నాలజీ సమాజంలోని అన్ని వర్గాల వారికి అందుబాటులో ఉంచడంలో LG వారి నిబద్ధతను మరింత దృఢతరం చేస్తోంది. ఈ సందర్భంగా, యంగ్మిన్ హ్వాంగ్, డైరెక్టర్, గృహోపకరణాలు & ఎయిర్ కండీషనర్ - LG ఎలక్ట్రానిక్స్ ఇండియా ఇలా అన్నారు, “మా కొత్త ఉత్పత్తులు మరియు టెక్నాలజీలలో  అందరికీ మెరుగైన జీవితాన్ని చేయడమే  LGలో, మా లక్ష్యం. ఈ AC రిమోట్ అంధుల కోసం రూపొందించబడింది మరియు ప్రతి ఒక్కరు సులభంగా తమ సౌకర్యంతో ఆనందించడాన్ని ఇది నిర్థారిస్తుంది.బ్రైలీని సమీకృతం చేయడం ద్వారా, మేము చేరిక యొక్క మా ప్రయాణం దిశగా మరియు మా కస్టమర్లకు అందుబాటులో ఉంచే దిశగా ఒక అడుగు వేసాము.”

విడుదల గురించి మాట్లాడుతూ, శ్రీ. సంజయ్ చిత్కారా, సీనియర్,Vp- హోమ్ అప్లైయెన్సెస్ అండ్ ఎయిర్ కండిషనర్, LG ఎలక్ట్రానిక్స్ ఇండియా, ఇలా అన్నారు, “LGలో, వినూత్నత ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉండాలని మేము విశ్వసిస్తాం. బ్రైలీ AC  రిమోట్ కవర్ విడుదల అంధుల సమాజానికి  సాధికారత కల్పించే దిశగా తీసుకున్న చర్యకు నిదర్సనం, అందరి వలే LG ఉత్పత్తుల సౌకర్యం మరియు సౌలభ్యతలను వారు ఆనందించడాన్ని నిర్థారిస్తుంది. అడ్డంకులను ఛేదించడంలో మా అంకితభావం సమీకృత టెక్నాలజీ ద్వారా జీవితాలను మెరుగుపరచడానికి మా మిషన్లో లోతుగా పాతుకుంది.”

ఈ చొరవ గురించి వ్యాఖ్యానిస్తూ, మీనాక్షి చాంద్ వని, డైరెక్టర్- ప్రోగ్రాంస్ అండ్ పార్ట్ నర్ షిప్స్, నేషనల్ అసోసియేషన్ ఫర్ ది బ్లైండ్, ఇలా అన్నారు: “ద బ్రైలీ AC రిమోట్ కవర్ చేరికలో ఒక వినూత్నమైన చర్య. ఉపయోగించడంలో సమస్యను కలిగించే డివైజ్ లను స్వతంత్రంగా ఆపరేట్ చేయడానికి ఇది అంధులకు అనుమతిస్తుంది. అందుబాటులో ఉంచడానికి LG నిబద్దతను మేము ప్రశంశిస్తాం, మరియు వైకల్యాలు కలిగిన ప్రజలకు సాధికారత కలిగించే మరిన్ని ఆవిష్కరణలను మేము చూడాలని మరియు మరింత సమీకృత సమాజాన్ని ప్రోత్సహించడానికి ఆశిస్తున్నాము.”

బ్రైలీ AC రిమోట్ కవర్ విభిన్నమైన వినియోగదారు అవసరాలను తీర్చే పరిష్కారాలను రూపొందించడానికి మరియు టెక్నాలజీ అందరి జీవితాలను మెరుగుపరచాలని కంపెనీ వారి నమ్మకాన్ని దృఢతరం చేస్తూనే   LG వారి విస్తృతమైన ప్రయత్నాలలో ఒక భాగం.  మరింత సమీకృతమైన, అందుబాటులో ఉండే ప్రపంచం యొక్క కలను ప్రతిబింబించే అలాంటి వినూత్నమైన ఉత్పత్తులలో పెట్టుబడి పెట్టడాన్ని LG కొనసాగిస్తుంది.