Aeroplane Celebration: రవూఫ్‌కు కౌంటరిచ్చిన బుమ్రా.. డిప్పింగ్ ఫ్లైట్ సంబరాలు.. వీడియో వైరల్ (video)
ఆసియా కప్‌ను వివాదాలు వదలట్లేదు. ఈసారి భారత బౌలర్ జస్ప్రీత్ బుమ్రా పాకిస్తాన్ ఆటగాడు హరిస్ రౌఫ్ వికెట్ తీసుకుని, డిప్పింగ్ ఫ్లైట్ సైగ చేశాడు. ఈ చర్య చర్చలకు దారితీసింది. ఈ సీన్ మైదానంలో భారీగా చప్పట్లు కొట్టేందుకు దారి తీసింది.
గత ఆదివారం దుబాయ్‌లో భారత్, పాకిస్తాన్ మధ్య జరిగిన సూపర్ ఫోర్ మ్యాచ్‌లో, సంజు సామ్సన్‌ను అవుట్ చేసిన తర్వాత రౌఫ్ ఫైటర్ జెట్ సైగ చేశాడు. తరువాత బీసీసీఐ ఐసీసీకి ఫిర్యాదు చేసింది. రవూఫ్ ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించినట్లు తేలింది.
ఈ చర్యలకు అతనికి మ్యాచ్ ఫీజులో 30 శాతం జరిమానా కూడా విధించబడింది. తాజాగా.. బుమ్రా వికెట్ తీసిన సమయంలో మిసైల్ సంబరాలు చేసుకొని హారిస్ రవూఫ్‌కు గట్టి కౌంటర్ ఇచ్చాడు. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది.
మరోవైపు టీమిండియా ఈ మ్యాచ్‌లో పాకిస్తాన్‌ను ఐదు వికెట్ల తేడాతో ఓడించి తొమ్మిదవ ఆసియా కప్ టైటిల్‌ను గెలుచుకుంది. విజయం కోసం 147 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో, స్పిన్ బౌలర్ కుల్దీప్ యాదవ్ 4-30 గణాంకాలతో రాణించడంతో, తిలక్ వర్మ అజేయంగా 69 పరుగులతో భారత్ రెండు బంతులు మిగిలి ఉండగానే తమ లక్ష్యాన్ని చేరుకుంది.