శుక్రవారం, 10 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. క్రైం న్యూస్
Written By ఠాగూర్
Last Updated : మంగళవారం, 24 డిశెంబరు 2024 (12:47 IST)

కోల్‌కతా వైద్యురాలి హత్యాచార కేసు : వెలుగులోకి నమ్మలేని నిజాలు ఎన్నెన్నో?

victim girl
గత ఆగస్టు నెల 9వ తేదీన కోల్‌కతాలోని ఆర్జీ కర్ వైద్య కాలేజీ ఆస్పత్రిలో జూనియర్ వైద్యురాలు హత్యాచారం జరిగింది. ఇది దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఈ కేసులో నమ్మశక్యంగాని పలు విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. వైద్యురాలి మృతదేహాన్ని గుర్తించిన నాలుగో అంతస్తుల్లోని సెమీనార్ రూమ్‌లో అత్యాచారం, హత్య జరిగినట్టు ఆధారాలు దొరకలేదని సెంట్రల్ ఫోరెన్సిక్ రీసెర్స్ లేబోరేటరీ నివేదిక వెల్లడించింది. ఇద్దరి మధ్య పెనుగులాట జరిగినట్టుగా ఎలాంటి ఆధారాలు లభించలేదని నివేదిక పేర్కొంది. నేరం జరిగిన ప్రదేశం సెమినార్ రూమ్ కాకపోవచ్చని సందేహాలు వ్యక్తం చేసింది. 
 
సమినార్ గదిలో నీలి రంగు పరుపుపై వైద్యురాలు దాడికి పాల్పడిన వ్యక్తికి ఎలాంటి గొడవ లేదా దాడి జరిగినట్టు ఆధారాలు కనిపించలేదని నివేదిక విశ్లేషించింది. రూమ్ లోపల మరెక్కడా ఆనవాళ్ళు లేవని పేర్కొంది. ఈ మేరకు దర్యాప్తు సీబీఐకి సీఎఫ్ఎస్ఎల్ ఇటీవలే నివేదిక సమర్పించింది.