శుక్రవారం, 10 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. క్రైం న్యూస్
Written By ఠాగూర్
Last Updated : మంగళవారం, 3 డిశెంబరు 2024 (11:12 IST)

అవకాశాలు లేకపోవడం వల్లే కన్నడ నటి శోభిత సూసైడ్ : డీసీపీ

shobita shivanna
ఇటీవల హైదరాబాద్ నగరంలో కన్నడ నటి శోభిత ఆత్మహత్య చేసుకోవడానికి ప్రధాన కారణంపై పోలీసులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. సినిమా అవకాశాలు లేకపోవడంతో నటనకు దూరం కావడాన్ని ఆమె తట్టుకోలేక ప్రాణాలు తీసుకుని వుంటారని పోలీసులు సందేహిస్తున్నారు. ఈ విషయాన్ని మాదాపూర్ డీసీపీ వినీత్ వెల్లడించారు. 
 
ఇదే అంశంపై ఆయన మాట్లాడుతూ, శోభితది ఆత్మహత్య అని విచారణలో వెల్లడైందని, ఆమె మృతిపై కుటుంబ సభ్యులకు ఎలాంటి అనుమానాలు లేవన్నారు. అయితే ఈ ఆత్మహత్యకు గల ఖచ్చితమైన కారణాలు తెలియాల్సి ఉందన్నారు. దొరికిన ఆధారాలను బట్టి ఆత్మహత్యగా తేల్చామన్నారు. 
 
పోస్టుమార్టం రిపోర్టులో కూడా ఎలాంటి అనుమానాలు వ్యక్తం కాలేదన్నారు. ఆత్మహత్యకు ముందు డైరీలో ఏమైనా రాసుకుందా? స్నేహితులకు ఏమైనా సందేశం పంపించిందా? అని చెక్ చేస్తున్నామన్నారు. భార్యాభర్తల మధ్య ఎలాంటి విభేదాలు లేవన్నారు. కుటుంబ సభ్యులతో పాటు స్నేహితులను కూడా విచారిస్తున్నట్లు తెలిపారు.