శుక్రవారం, 10 జనవరి 2025
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. వ్యాధి
Written By సిహెచ్
Last Modified: మంగళవారం, 19 డిశెంబరు 2023 (19:14 IST)

నిమ్మకాయ, ఉసిరికాయ పచ్చళ్లు రాత్రిపూట తినరాదా?

Lemon pickle
రాత్రి భోజనంలో నిమ్మకాయ, ఉసిరికాయ పచ్చళ్లు తినరాదని వైద్య నిపుణులు చెపుతుంటారు. ఆమ్లతత్వం వున్న వీటిని తినడం వల్ల కలిగే దష్ప్రభావాలు ఏమిటో తెలుసుకుందాము. రాత్రివేళ చేసే భోజనంతో పాటు నిమ్మకాయ పచ్చడి, ఉసిరికాయ పచ్చడి తినకూడదని నిపుణులు చెపుతారు.
రాత్రిపూట వాతం అధికముగా ఉంటుంది కనుక తినరాదని చెప్తారు.
 
నిమ్మ, ఉసిరి పచ్చళ్లు తింటే కొందిరిలో పక్షవాత రోగం వచ్చే ప్రమాదం ఉందని నిపుణులు చెప్తారు.
కొంతమందిలో అసిడిటీ సమస్య కూడా రావచ్చు. వాత రోగులు ఆనపకాయ, దోసకాయ, పెసరపప్పు, కొత్త చింతకాయ, ఉసిరి పచ్చడి తినరాదు.
 
కొందరిలో జుట్టు రాలే సమస్య కూడా వస్తుంది. గుండె సమస్యలు వున్నవారు ఈ పచ్చళ్లను దూరం పెట్టాలని వైద్యులు సూచిస్తున్నారు.