శుక్రవారం, 10 జనవరి 2025
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. కథనాలు
Written By సిహెచ్
Last Modified: మంగళవారం, 5 నవంబరు 2024 (17:07 IST)

కండలు పెంచాలంటే ఇవి తినాలి, ఏంటవి?

muscle
చాలామంది వయసు పెరుగుతున్నా చాలా సన్నగా, బలహీనంగా కనబడుతుంటారు. ఇలాంటివారు తాము తినే ఆహారంలో మార్పులు చేసుకుంటే బలమైన కండలతో శక్తివంతంగా మారుతారు. కండపుష్టికి ఏయే ఆహార పదార్థాలను తీసుకోవాలో తెలుసుకుందాము.
 
కోడిగుడ్లు అధిక నాణ్యత గల ప్రోటీన్ కలిగి ఉంటాయి, ఇది కండరాల నిర్మాణానికి సహాయపడుతాయి.
చికెన్ బ్రెస్ట్ కండరాల పెరుగుదలకు ఎంతగానో మేలు చేస్తుంది.
సాల్మన్, ట్యూనా చేపలు వంటి కొవ్వు చేపలు తింటుంటే కండపుష్టిని కలిగిస్తాయి.
పాలలో ప్రోటీన్ మరియు కాల్షియం మరియు మెగ్నీషియం వంటి ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి.
వేరుశెనగ, బఠానీ వంటి పప్పుధాన్యాలు తింటుంటే కండర నిర్మాణానికి దోహదపడతాయి.
వెన్నలో ప్రోటీన్, కాల్షియం పుష్కలంగా ఉంటాయి కనుక ఇది బలాన్ని, కండపుష్టిని కలిగిస్తుంది.
బాదం పప్పులు, వాల్‌నట్‌లు, జీడిపప్పు, ఇతర గింజలు బలమైన కండరాలను నిర్మించడంలో సహాయపడతాయి.