శుక్రవారం, 10 జనవరి 2025
  1. ఇతరాలు
  2. బాలప్రపంచం
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : సోమవారం, 10 జులై 2023 (10:30 IST)

డ్రై ఫ్రూట్స్ పిల్లలకు ఇస్తే.. ఏంటి ప్రయోజనం?

ఎండుద్రాక్ష అందరికీ ఇష్టమైన డ్రై ఫ్రూట్స్. వాటి వల్ల పిల్లలకు ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయో చూద్దాం. ఎండుద్రాక్ష పిల్లలకు ఆహారం నుండి పొందలేని అవసరమైన పోషకాలను ఇవ్వగలదు. ఎండు ద్రాక్షను పిల్లలకు ఇస్తే వారి ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. 
 
ఎండుద్రాక్షలో కేలరీలు, గ్లూకోజ్, ఫ్రక్టోజ్ అధికంగా ఉంటాయి. ఇది బరువు పెరగడానికి సహాయపడుతుంది. ఇది పిల్లల మానసిక, శారీరక ఎదుగుదలకు కూడా చాలా సహాయపడుతుంది. పిల్లలకు ఎండు ద్రాక్ష ఇవ్వడం వల్ల జ్ఞాపకశక్తి పెరుగుతుంది. 
 
మెదడుకు పోషణనిస్తుంది. జీర్ణక్రియను ప్రోత్సహిస్తుంది. ఎండు ద్రాక్ష నానబెట్టిన నీటిని పిల్లలకు జ్వరం సమయంలో ఇవ్వవచ్చు. ఇది బాక్టీరియల్, వైరల్ ఇన్ఫెక్షన్లతో పోరాడటానికి సహాయపడుతుంది. 
 
పిల్లలు ఆహారం నమలడం ప్రారంభించినప్పుడు లేదా 8 నెలల వయస్సు తర్వాత ఎండుద్రాక్షను ఇవ్వవచ్చు. ఎండు ఎండు ద్రాక్షను నానబెట్టి గుజ్జులా చేసి చిన్న పిల్లలకు ఇవ్వవచ్చు. రోజుకు ఒక స్పూన్ చొప్పున ఇవ్వవచ్చునని న్యూట్రీషియన్స్ అంటున్నారు.