నా ముందు ప్యాంట్ జిప్ తీస్తావా? చీపురుతో చితక్కొట్టిన పారిశుద్ధ్య కార్మికురాలు (video).. ఎక్కడ?
మహిళలపై అకృత్యాలు పెరిగిపోతున్నాయి. ఎక్కడపడితే అక్కడ కామాంధులు ఏదో ఒక రీతిలో మహిళలను వయోబేధం లేకుండా వేధింపులకు గురిచేస్తున్నారు. ఈ లైంగిక వేధింపులను చాలామంది సహించుకుని మిన్నకుండిపోతున్నారు. కానీ కొందరు మాత్రం కామాంధులకు తగిన బుద్ధి చెప్తున్నారు. అలా ఓ మహిళ తనను వేధించిన వ్యక్తికి చుక్కలు చూపించింది. నడి రోడ్డుపైనే చీపురుతో కొట్టింది. ఈ ఘటన తమిళ నాడు చెన్నై నగరంలో చోటుచేసుకుంది.
వివరాల్లోకి వెళితే.. సోమవారం ఉదయం అడయార్‌లో 50 ఏళ్ల పారిశుధ్య కార్మికురాలు తనతో అసభ్యంగా ప్రవర్తించడానికి ప్రయత్నించిన బైకర్‌ను ధైర్యంగా ఎదుర్కొంది. ఆమె అడయార్ వంతెన వద్ద శుభ్రం చేస్తుండగా, హెల్మెట్ ధరించిన మోటార్‌బైక్‌పై ఉన్న వ్యక్తి ఆమె దారికి అడ్డుపడ్డాడు.
ఆమె అతన్ని కదలమని అడిగినప్పుడు, అతను ప్యాంట్ జిప్ తీశాడు. దీంతో ఆవేశంతో ఊగిపోయిన ఆ కార్మికురాలు తన చీపురుతో అతన్ని కొట్టడంతో అతను పారిపోయేలా చేసింది.
ఈ సంఘటనను డాష్‌బోర్డ్ కెమెరాలో బంధించి పోలీసులకు అప్పగించారు. వారు దర్యాప్తు ప్రారంభించారు.