శుక్రవారం, 10 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : శుక్రవారం, 11 అక్టోబరు 2024 (21:49 IST)

గూడ్సు రైలును ఢీకొన్న మైసూర్ - దర్బంగా ఎక్స్‌ప్రెస్... మంటల్లో 2 బోగీలు..

darbhanga express train
తమిళనాడు రాష్ట్రంలోని తిరువళ్లూరు జిల్లా కవరైపేటలో ఘోర రైలు ప్రమాదం జరిగింది. మైసూరు నుంచి దర్బంగాకు వెళుతున్న (12578) ఎక్స్‌ప్రెస్ రైలు... పట్టాలపై ఆగివున్న గూడ్సు రైలును ఢీకొట్టింది. దీంతో రెండు బోగీల్లో మంటలు చెలరేగాయి. మైసూర్ ఎక్స్‌ప్రెస్‌కు చెందిన ఆరు బోగీలు పట్టాలు తప్పాయి. ఈ ప్రమాదంలో ప్రాణనష్టం వివరాలు తెలియాల్సివుంది. 
 
తిరువళ్లూరు సమీపంలోని కావరైపేట వద్ద ఆగి ఉన్న గూడ్సు రైలును ఎక్స్‌ప్రెస్‌ రైలు ఢీకొట్టింది. ఈ ఘటనలో రెండు బోగీల్లో మంటలు చెలరేగినట్లు సమాచారం. మైసూరు - దర్భంగా మధ్య నడిచే ఎక్స్‌ప్రెస్‌ పట్టాలపై ఆగివున్న సరకు రవాణా రైలును అతి వేగంతో వచ్చిన ఎక్స్‌ప్రెస్ వెనుక నుంచి వచ్చి ఢీకొట్టడంతో ఈ ఘటన చోటుచేసుకుంది. 
 
ఈ ఘటనలో పలు బోగీలు పట్టాలు తప్పగా.. రెండు బోగీల్లో మంటలు చెలరేగాయి. సమాచారం అందుకున్న రైల్వే అధికారులు, సహాయ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపడుతున్నారు. అయితే ఈ ప్రమాదంలో అనేక మంది ప్రయాణికులు తీవ్రంగా గాయపడినట్టు సమాచారం. మృతులు కూడా ఉండే అవకాశం ఉందని ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు.