ఆదివారం, 28 సెప్టెంబరు 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : బుధవారం, 17 సెప్టెంబరు 2025 (18:43 IST)

శబరిమల అభివృద్ధికి రూ.70.37 కోట్లు ఖర్చు చేశాం-వాసవన్ ప్రకటన

Sabarimala
Sabarimala
కేరళలోని సుప్రసిద్ధ ఆలయం శబరిమల అభివృద్ధికి సంబంధించి వివిధ ప్రాజెక్టుల కోసం ఆ రాష్ట్ర ప్రభుత్వం రూ.70.37 కోట్లు ఖర్చు చేసిందని బుధవారం అసెంబ్లీకి సమాచారం అందింది. 2016 నుండి వరుసగా వచ్చిన ప్రభుత్వాలు శబరిమల మాస్టర్ ప్లాన్ కింద అనేక ప్రాజెక్టులను చేపట్టి పూర్తి చేశాయని రాష్ట్ర దేవస్వం మంత్రి వి.ఎన్. వాసవన్ సభలో తెలిపారు.
 
2022-23, 2024-25 మధ్య, శబరిమల మాస్టర్ ప్లాన్ హై-లెవల్ కమిటీ రాష్ట్ర ప్రభుత్వం నుండి రూ.18.39 కోట్లు విడుదల చేయాలని కోరింది. ఇందులో రూ.15.69 కోట్లు ఇప్పటికే పంపిణీ చేయబడ్డాయి.
 
2020లో నీలక్కల్ వద్ద ఉన్న ఆలయ బేస్ క్యాంప్ కోసం లేఅవుట్ ప్లాన్‌ను ప్రభుత్వం ఆమోదించిందని వాసవన్ పేర్కొన్నారు. అప్పటి నుండి, సన్నిధానం, పంపా, ట్రెక్కింగ్ మార్గం కోసం లేఅవుట్ ప్లాన్‌లు కూడా మంజూరు చేయబడ్డాయని వాసవన్ చెప్పుకొచ్చారు.