శుక్రవారం, 10 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : శనివారం, 16 నవంబరు 2024 (15:21 IST)

శివాజీ నడిచిన నేల.. ఎలాంటి దమ్కీలకు భయపడేది లేదు.. పవన్ కల్యాణ్ (video)

Pawan Kalyan
Pawan Kalyan
ఛత్రపతి శివాజీ మహారాజ్ నడిచిన నేలపై తాము ఎవరికీ భయపడేది లేదని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ అన్నారు. సినిమాల్లో పోరాటం చేయడం.. గొడవ పెట్టడం చాలీ ఈజీ అని.. నిజ జీవితంలో ధర్మం కోసం కొట్లాడటం, నిలబడటం చాలా కష్టమని తెలిపారు. హిందువులంతా ఏకమైతే.. హైదరాబాద్ నుంచి దేశాన్ని విచ్ఛిన్నం చేసేందుకు వచ్చే వాళ్లు ఎంత అంటూ ఓవైసీ సోదరులను ఉద్దేశించి ఆయన హాట్ కామెంట్స్ చేశారు. 
 
ఛత్రపతి శివాజీ నడిచిన నేలలో ఎలాంటి దమ్కీలకు భయపడేది లేదని మజ్లిస్ పార్టీ నేతలకు పవన్ మాస్ వార్నింగ్ ఇచ్చారు. మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ఆయన మహాయుతి కూటమి గెలుపు కోసం డెగ్లూర్‌లో ప్రచారంలో పాల్గొన్నారు. 
 
ఈ సందర్భంగా పవన్ మాట్లాడుతూ.. శివాజీ మహరాజ్ గడ్డపై అడుగుపెట్టినందుకు సంతోషంగా వుందన్నారు.  శివసేన-జనసేన సనాతనాన్ని రక్షించేందుకు ఆవిర్భవించాయన్నారు. బాలా సాహెబ్ కలలు కన్న అయోధ్య రామమందిరాన్ని నిర్మించి చూపించిన వ్యక్తి ప్రధాన మంత్రి మోదీ అంటూ ప్రశంసలు కురిపించారు.