గురువారం, 25 సెప్టెంబరు 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : మంగళవారం, 16 సెప్టెంబరు 2025 (14:38 IST)

నదిలో కొట్టుకునిపోయిన ట్రాక్టర్... పది మంది గల్లంతు.. ఎక్కడ?

Flood water at prakasam barrage
ఉప్పొంగి ప్రవహిస్తున్న ఓ నదిలో ట్రాక్టర్ ఒకటి కొట్టుకుని పోయింది. ఆ సమయంలో ఇందులో ప్రయాణిస్తున్న 10 మంది గల్లంతయ్యారు. వీరంతా కూలీలుగా భావిస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించిన షాకింగ్ వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఈ ఘటన గత కొన్ని రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్న ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని డెహ్రాడూన్‌లో జరిగింది. 
 
స్థానికులు వెల్లడించిన వివరాల మేరకు... పది మంది కూలీలు ఓ ట్రాక్టర్‌లో ఉప్పొంగి ప్రవహిస్తున్న నదిని దాటుతున్నారు. ఆ ట్రాక్టర్ నది మధ్యలోకి ఆగిపోయింది. దీంతో భయాందోళనకుగురైన కూలీలు ప్రాణభయంతో కాపాడాలంటూ కేకలు వశారు. అయితే, నదిలో నీటి ప్రవాహం ఒక్కసారిగా పెరిగిపోవడంతో ట్రాక్టర్ కాస్త బోల్తాపడింది. దీంతో అందులోని వారంతా నీటిలో కొట్టుకునిపోయి గల్లంతయ్యారు. 
 
దీంతో నది ఒడ్డున ఉన్న గ్రామస్థులు నిస్సహాయంగా చూస్తుండిపోయారు. కూలీల కుటుంబ సభ్యులు రోదిస్తూ నది ఒడ్డున పరుగులు తీశారు. తమ వారిని కాపాడుకునేందుకు ఆరాటపడ్డారు. అయితే, నీటి ప్రవాహం ఉధృతంగా ఉండటంతో కొన్ని క్షణాల్లోనే ఆ కూలీలంతా గల్లంతయ్యారు. వీరంతా చనిపోయివుంటారన ి కుటుంబీకులు భావిస్తున్నారు.